సాగునీటి కోసం సీమ నేతలు సమైక్యంగా పోరాటం చేయాలి: Amarnath

ABN , First Publish Date - 2021-09-11T17:37:34+05:30 IST

రాజశేఖర్ రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నామని చెప్పడంతోనే రాయలసీమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి అన్నారు.

సాగునీటి కోసం సీమ నేతలు సమైక్యంగా పోరాటం చేయాలి: Amarnath

అనంతపురం: రాజశేఖర్ రెడ్డి మిగులు జలాలపై హక్కును వదులుకుంటున్నామని  చెప్పడంతోనే రాయలసీమకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డి అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తుపై సీమ నేతల సదస్సులో ఆయన మాట్లాడుతూ గడిచిన రెండు సంవత్సరాల నుంచి చిత్తూరు జిల్లాలో ఎలాంటి పనులు జరగడం లేదన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వడం మినహా ఏమీ చేయడం లేదని విమర్శించారు. చెరువుల్లో నీరు నింపితే ఇసుక తరలించడం సాధ్యం కాదన్న ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టు పనుల కోసమే వైసీపీ నేతలు పనులు చేస్తున్నారన్నారు. దీనిపై జిల్లాలో ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నట్లు చెప్పారు.  కుప్పం నియోజకవర్గం నుంచే పాదయాత్ర చేపడుతున్నామన్నారు. సాగు నీటి సాధన కోసం రాయలసీమ జిల్లా టీడీపీ నేతలు అందరూ కూడా సమైక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అమర్నాథరెడ్డి పిలుపునిచ్చారు. 

Updated Date - 2021-09-11T17:37:34+05:30 IST