
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అమరావతి మీదే ప్రేమ ఉందని మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... విశాఖకు పరిపాలన రాజధాని బాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. విశాఖలో టీడీపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందన్నారు. జగన్ ది ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఖండిస్తున్నామని అన్నారు. జగన్, విజయ సాయి రెడ్డి విశాఖలో ఏమి దోచుకున్నారో బాబు చెప్పాలని అవంతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి