పవన్‌పై వ్యాఖ్యల వెనుక జగన్ హస్తం: Bandaru

ABN , First Publish Date - 2021-09-30T16:19:10+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు.

పవన్‌పై వ్యాఖ్యల వెనుక జగన్ హస్తం: Bandaru

విశాఖపట్నం: వైసీపీ ప్రభుత్వంలో అవినీతి దారుణంగా పెరిగిపోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి  విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ మంత్రుల మాట తీరు చూస్తే సిగ్గేస్తోందని....వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు వెనుక సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. చిన్న చిన్న విషయానికి మీడియా ముందుకొచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి, పవన్ కళ్యాణ్ విషయంపై ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. కుల రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. 2023కే ప్రభుత్వం కూలిపోతుందన్నారు. ఎన్టీఆర్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఆదర్శాల కోసం వచ్చారు తప్ప ఆదాయం కోసం కాదని స్పష్టం చేశారు. సినిమాల్లోనే ఎక్కువగా డబ్బులు, పేరు  వస్తాయన్నారు. 2014లోనే కలిసి పోటీ చేశామని...2019 వేరుగా పోటీ చేశామని చెప్పారు. చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు. 2024లో కలవాలన్న ఏం చేయాలన్న చంద్రబాబు నాయుడు, పవన్ మీద ఆధారపడి ఉంటుందని బండారు సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-30T16:19:10+05:30 IST