Kalva srinivasulu: లక్షలాది డాక్టర్లు తయారయ్యే వర్సిటీకి రౌడీ పేరు పెడతారా

ABN , First Publish Date - 2022-09-21T19:33:17+05:30 IST

ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు.

Kalva srinivasulu: లక్షలాది డాక్టర్లు తయారయ్యే వర్సిటీకి రౌడీ పేరు పెడతారా

అమరావతి: ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ (NTR Health university) పేరు మార్పు దుర్మార్గమని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు (Kalva srinivasulu) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... అసలు అప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (YS Rajashekar reddy) ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. లక్షలాది డాక్టర్‌లు తయారయ్యే యూనివర్శిటీకి రౌడీ పేరు పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ (CM Jagan) నిర్ణయం మార్చుకోకపోతే  చరిత్ర కూడా క్షమించదని హెచ్చరించారు. 


మహాపాదయాత్రకు సంఘీభావం

మరోవైపు అమరావతి రైతుల మహా పాదయాత్ర (Amaravati farmers Maha padayatra)కు కాల్వ సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి మాజీ మంత్రి పాదయాత్రలో పాల్గొని ప్రసంగించారు. అమరావతి రైతుల యాత్రలో న్యాయం ఉందన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి (AP CM) అమరావతి రాజధాని అని ఒప్పుకున్నారని, ఎన్నికల సమయంలో హామీల వర్షం కురిపించారని గుర్తుచేశారు. ఇప్పుడు మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. అధికారం ఉందనే అహంకారంతో మంత్రులు మాట్లాడుతున్నారని అన్నారు. ‘‘మీ ఇళ్లల్లో మహిళలు లేరా, నోళ్లు అదుపులో పెట్టుకోవాలి’’ అని కాల్వ శ్రీనివాసులు (TDP leader) హితవుపలికారు. 

Updated Date - 2022-09-21T19:33:17+05:30 IST