మాజీ మంత్రి Nakka Anand babu హౌస్ అరెస్ట్

ABN , First Publish Date - 2022-06-04T16:27:46+05:30 IST

వైసీపీ గుండాల చేతిలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు ఈరోజు నరసరావుపేటలో జరుగుతున్న నేపథ్యంలో...

మాజీ మంత్రి Nakka Anand babu హౌస్ అరెస్ట్

గుంటూరు: వైసీపీ గుండాల చేతిలో హత్యకు గురైన కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు ఈరోజు నరసరావుపేటలో జరుగుతున్న నేపథ్యంలో...  పోలీసులు ముందస్తు హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మృతదేహాన్ని చూడటానికి నరసరావుపేట బయలు దేరిన మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు‌ను పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు.  నరసరావుపేట వెళ్లకుండా టీడీపీ నేతను ఇంటి ముందే పోలీసులు అడ్డుకున్నారు. ‘‘ఏ కారణంతో నన్ను ఆపుతున్నారో సమాధానం చెప్పాలి. పోలీసులకు ప్రతి రోజు ఓ ఆట అయిపోయుంది. అక్రమంగా నన్ను నిర్బంధిస్తే కోర్టులో పిటిషన్ వేస్తా. వైసీపీ నేతలు చెప్పినట్లు పోలీసులు ఆడితే ఇబ్బందులు పడతారు. పట్టపగలే హత్య చేస్తుంటే పోలీసులు ఏం చేయడం లేదు. పరామర్శలకు వెళ్లే తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం’’ అంటూ పోలీసుల తీరుపై ఆనంద బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-04T16:27:46+05:30 IST