Tummala nageshwar rao: తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా

ABN , First Publish Date - 2022-08-22T19:51:07+05:30 IST

టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala nageshwar rao: తమ్మినేని కృష్ణయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నా

ఖమ్మం: టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య (Tammineni krishnaiah) హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummal nageshwar rao) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం దురదృష్టకరమన్నారు. కృష్ణయ్యను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలందరు కోరుతున్నారని తెలిపారు. అధికారులు, పోలీసులు వారి మీదున్న నమ్మకాన్ని, బాధ్యతను గుర్తించి వారి విధులు నిర్వహించాలని సూచించారు.  కృష్ణయ్య హత్యను సమర్ధించిన వారు, సపోర్ట్ చేసిన వ్యక్తుల అంతరాత్మ గోషిస్తుందని తెలిపారు. వ్యవస్థలు న్యాయం తరుపున ఉండి కేసును ఇన్వెస్టిగేషన్ చేసి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఇలాంటి చర్యలను ప్రోత్సాహించిందన్నారు. దోషులకు శిక్ష పడేందుకు సాయా శక్తులా తాను ప్రయత్నిస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 

Updated Date - 2022-08-22T19:51:07+05:30 IST