ఒక్కో కోడిపై రెండు మూడు లక్షలు.. ఒక్క రోజులో రూ.50 లక్షలు.. బెట్టింగ్ లపై గతంలో Open Heart లో Chintamaneni Prabhakar ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2022-07-08T23:59:46+05:30 IST

చింతమనేని ప్రభాకర్.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. సంచలనాకు మారుపేరైన ఆయన.. ఇటీవల కోడిపందెంలో పాల్గొనడం తీవ్ర దుమారాన్ని లేపింది. హైద‌రాబాద్..

ఒక్కో కోడిపై రెండు మూడు లక్షలు.. ఒక్క రోజులో రూ.50 లక్షలు.. బెట్టింగ్ లపై గతంలో Open Heart లో Chintamaneni Prabhakar ఏమన్నారంటే..

చింతమనేని ప్రభాకర్.. ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. సంచలనాలకు మారుపేరైన ఆయన.. ఇటీవల కోడిపందెంలో పాల్గొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. హైద‌రాబాద్ శివారులోని పటాన్‌చెరు మండలం చినకంజర్లకు స‌మీపంలో కోడి పందెంలో పాల్గొన్న ఆయన.. పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో అక్కడి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. దీనిపై చింతమనేని వివరణ ఇచ్చారు. తనకు కోడి పందేలు ఆడడం వ్యసనమని, అది ఘోరమో, నేరమో కాదంటూ చెప్పుకొచ్చారు. అయితే చట్టం దృష్టిలో నేరం కాబట్టి.. పోలీసులు వచ్చే సమయంలో తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. న్యాయాన్ని గౌరవిస్తానని, అయితే బలహీనత కావడంతో కోడిపందేలకు వెళ్లినట్లు వివరించారు. తనను ఇరికించడానికి కొందరు కావాలనే ఫొటోలు, వీడియోలు తీసి కుట్రపన్నారని ఆరోపించారు.


గతంలో ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని ప్రభాకర్.. కోడి పందేలు, అందులోని లాభనష్టాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవి ఆయన మాటల్లోనే.. ‘‘ రోజుకు ఒక కోడిపై మూడు నుంచి, నాలుగు లక్షల పందెం కాస్తా.. ఈ లెక్కన రోజుకు రూ.40 నుంచి రూ.50లక్షలు కాస్తాను. గుడివాడలో ఇప్పటి వరకూ ఒక కోడిపై రూ.27లక్షల పందెమే టాప్. అందులో లాభనష్టాలు మన చేతుల్లో ఉండవు. నేను ఆడేది చిన్న మొత్తమే.. చాలా మంది కోట్లలో పందెం కాస్తారు. కొందరైతే కేవలం పందెం కోడిని కూర వండుకోవాలనే ఉద్దేశంతోనే పాల్గొంటూ ఉంటారు. గుడివాడలో జరిగే కోడిపందేలకు తరచూ వెళ్తుంటా. అయితే ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి.. సొంత జిల్లాలో పందేలు ఆడటం ఇష్టం లేక వెళ్లడం లేదు.


‘‘నేనెప్పుడూ కోడి పందేలు నిర్వహించలేదు.. బయటి ప్రాంతాల్లో భారీ స్థాయిలో జరిగే పందేలకు మాత్రం వెళ్తుంటాను. కోడి పందేలు అనేది గ్రామీణ క్రీడ.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని దాన్ని రాజకీయం చేస్తున్నారు. గుడివాడలో మంత్రి నాని.. క్యాసినో నిర్వహించి, అందులోనే కోడి పందేలను కూడా ఆడించారు. దీనిపై జగన్ వివరణ కూడా అడగలేదని.. కొడాలి నాని చెప్పుకొంటున్నాడు. తప్పు చేసి మరీ గొప్పలు చెప్పుకొంటున్నాడు. ఆయన స్థాయిలో నేను ఉండి ఉంటే.. తప్పును నిజాయితీగా ఒప్పుకొనేవాన్ని. అదే టీడీపీ హయాంలో అలాంటి తప్పు నేను చేసుంటే.. మా నాయకుడు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేవాడు’’.. అని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు.

Updated Date - 2022-07-08T23:59:46+05:30 IST