
విజయవాడ: మంత్రి వెలంపల్లి పచ్చి అబద్ధాల కోరు అని.. విశ్వాసం లేని వ్యక్తని మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ...‘‘మంత్రిగా నియోజకవర్గంలో నువ్వు ఏం చేశావో మా హయాంలో నేను ఏం చేసేనా చర్చకు సిద్ధం. గాలిలో గెలిచింది వెలంపల్లి.. ఎదురుగాలిలో గెలిచింది నేను. మంత్రి వద్ద బ్రోకర్లు కోవిడ్ సమయంలో దోచుకున్నారు. సంపద కోసమే వెల్లంపల్లి రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవుళ్ల సొమ్మును కాజేస్తున్నారు. నేను ఇండిపెండెంట్‌గా పోటీ చేయడం వలన వెల్లంపల్లి ఎమ్మెల్యే అయ్యాడు... లేకుంటే ఐపి పెట్టి వెళ్లిపోయే వాడు. జూనియర్ కాలేజ్‌ను నేను తెస్తే వెలంపల్లి తెచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నారు. సిగ్గులేదా అలా చెప్పుకోడానికి. ముఖ్యమంత్రి, వెల్లంపల్లి అవగాహన లేని వారు. రాష్ట్రాన్ని, విజయవాడ నగరాన్ని జగన్ సర్వ నాశనం చేశారు. వెల్లంపల్లిని మంత్రి వర్గం నుంచి తీసేస్తారు. వైసిపి ప్రభుత్వం నడుస్తుంది మద్యపానం పైనే.. ఇంక మద్యపాన నిషేధం ఎందుకు చేస్తారు.. జగన్ మాట తప్పారు... మడమ తిప్పి మోసం చేశారు’’ అంటూ జలీల్ ఖాన్ వ్యాఖ్యలు చేశారు.
ఇవి కూడా చదవండి