వైసీపీ దాష్టీకాలు, దుర్మార్గాలు అధికమయ్యాయి: Yarapatineni

Nov 27 2021 @ 11:48AM

అమరావతి: వైసీపీ దాష్టీకాలు, దుర్మార్గాలు అధికమయ్యాయని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. తుమ్మల చెరువుకు చెందిన సైదాను విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. దాచేపల్లిలో ఒకర్ని, తంగెళ్ళులో ఒకర్ని కొట్టి చంపారని చెప్పారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో ఏడుగుర్ని పొట్టనపెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీ నాయకులను ప్రశ్నించినవారిపై దాడులా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. అసెంబ్లీలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘నేడు అధికారం మీదుంది, రేపు మాదవుతుంది, అప్పుడు మీ పరిస్థితేంటి?’’ అని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు విజ్ఞత కోల్పోయి, బరితెగించారని అన్నారు. మనుషులపై దాడులు చేసి తమరు ఏం సాధిస్తారని నిలదీశారు. దుశ్శాసన ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించే రోజులొస్తాయని యరపతినేని హెచ్చరించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.