Yarlagadda laxmiprasad: స్వరం మార్చలేదు... రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు

ABN , First Publish Date - 2022-09-27T17:02:08+05:30 IST

వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చి..వైఎస్సార్ పేరు పెట్టడం సబబు కాదని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు.

Yarlagadda laxmiprasad: స్వరం మార్చలేదు... రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు

విజయవాడ: వైద్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ (NTR) పేరు మార్చి..వైఎస్సార్ (YSR) పేరు పెట్టడం సబబు కాదని మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Yarlagadda laxmiprasad) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఎన్టీఆర్‌తో ఉన్న అనుబంధం కారణంగా తనకున్న మూడు పదవులకు రాజీనామా చేశానని... అదే రోజు రాజీనామా పత్రాలు అధికారులకు పంపినట్లు తెలిపారు. ‘‘నిన్న ఒక దినపత్రికలో స్వరం మార్చిన యార్లగడ్డ అని వార్త ఇచ్చారు. ఆ పత్రిక యజమాన్యానికి లేఖ ద్వారా స్వరం మార్చలేదు, రాజీనామాపై వెనక్కి తగ్గేది లేదు. భాషాభివృద్ధికి పదవే అవసరం లేదు, పదవిలో లేకపోయినా భాషాభివృద్ధికి కృషి చేస్తాను. లేఖ రాశాక ఇవాళ సవరణ అని వార్త ఇస్తారనుకున్న కానీ సవరణ ఇవ్వకుండా తిడుతున్నట్లు వార్త ఇచ్చారు. రాజీనామా చేసి జగన్‌ (Jagan mohan reddy)ను తిడుతున్నారెందుకు అని అమెరికా నుంచి కూడా అడుగుతున్నారు. నేనెప్పుడూ జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు. మంచి చేసినప్పుడు మంచి చేశారని చెప్పాను. పేరు మార్చడం నచ్చలేదు, రాజీనామా చేసి బయటకు వచ్చేసా. రాజీనామాపై వెనుకడుగు వేసేది లేదు. మళ్లీ తీసుకోమన్నా .. నేను వద్దనే చెబుతాను. లక్ష్మీపార్వతి (Laxmiparvati) వ్యాఖ్యలు ఆమె ఇష్టం.. నేను స్పందించను. కొత్తగా ఏర్పడిన ఏపీ (Andhrapradesh)లో రాజధానికి ఎన్టీఆర్ పేరు వచ్చేలా పెట్టాలని ఎప్పుడో చెప్పాను. ఆనాటి‌ ప్రభుత్వం అమరావతి (Amaravati) అని పేరు పెట్టింది. దేవేంద్రుడు రాజధాని అమరావతి.. ఆ పేరు ఏపీకి ఎందుకు. నేను మాట మార్చలేదు... నిర్ణయం మార్చుకోలేదు. సందేహాలు ఉంటే నా నంబర్ 9849067343కి కాల్ చేస్తే అన్ని ఆధారాలు ఇస్తా. ఇకనైనా నాపై అబద్దపు ప్రచారాలు ఆపాలని కోరుతున్నా’’ అని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ (Former mp) అన్నారు. 

Updated Date - 2022-09-27T17:02:08+05:30 IST