మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి సీఎం KCR

Published: Thu, 26 May 2022 14:02:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మాజీ ప్రధాని దేవెగౌడ నివాసానికి సీఎం KCR

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ(Deve Gowda) నివాసానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కాసేపటికి క్రితమే చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కుమార్ స్వామి (Kumar Swamy)... కేసీఆర్‌కు స్వాగతం పలికారు. కాసేపట్లో దేవెగౌడ, కుమారస్వామితో తెలంగాణ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. దేశ రాజకీయాలు, రాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. 


మరోవైపు హైదరాబాద్‌కు చేరుకున్న ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ(Narendra modi) తన ప్రసంగంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ కుటుంబ పాలనతో అవినీతిమయం అయ్యిందంటూ ప్రధాని విరుచుకుపడ్డ విషయం తెలిసిందే. ఈ క్రమంలో మోదీ వ్యాఖ్యలకు కౌంటర్‌గా సీఎం కేసీఆర్ బెంగళూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ఇవి కూడా చదవండిLatest News in Telugu

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.