Former CM భార్య ప్రతిభాసింగ్‌కు హిమాచల్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు

ABN , First Publish Date - 2022-04-27T13:45:45+05:30 IST

మండి పార్లమెంటరీ నియోజకవర్గ లోక్‌సభ సభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య అయిన ప్రతిభా సింగ్‌ను పార్టీ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్‌గా కాంగ్రెస్ హైకమాండ్

Former CM భార్య ప్రతిభాసింగ్‌కు హిమాచల్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు

సిమ్లా: మండి పార్లమెంటరీ నియోజకవర్గ లోక్‌సభ సభ్యురాలు, మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య అయిన ప్రతిభా సింగ్‌ను పార్టీ హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కొత్త చీఫ్‌గా కాంగ్రెస్ హైకమాండ్ తాజాగా నియమించింది. ఆమె కుల్దీప్ సింగ్ రాథోడ్ స్థానంలోకి రానున్నారు.నాలుగుసార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైన ముఖేష్ అగ్నిహోత్రి రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతుండగా, నదౌన్ ఎమ్మెల్యే,రాష్ట్ర పార్టీ మాజీ చీఫ్ సుఖ్‌విందర్ సింగ్ సుఖు రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచార కమిటీకి నాయకత్వం వహిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో నిర్ణయాత్మక పాత్ర పోషించే కేంద్ర ఎన్నికల కమిటీలో సుఖు కూడా సభ్యుడిగా ఉన్నారు.కాంగ్రెస్ పార్టీలో తమ ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వివిధ వర్గాల మధ్య కుమ్ములాటలు జరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ రాష్ట్ర శాఖను పునర్వ్యవస్థీకరించాలని పార్టీ నేతలు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. 


వీరభద్ర సింగ్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీ నాయకత్వ శూన్యతను ఎదుర్కొంటోంది.ప్రతిభా నియామకంతో కాంగ్రెస్ అంతర్గత పోరును అరికట్టడమే కాకుండా, వీరభద్ర సింగ్ వారసత్వాన్ని సొమ్ము చేసుకోవచ్చని భావిస్తున్నారు. వీరభద్ర మరణం తర్వాత ప్రజల నుంచి వచ్చిన సానుభూతి మండీ లోక్‌సభ స్థానం, మూడు అసెంబ్లీ సెగ్మెంట్‌లకు జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్‌కు లాభపడిందని భావిస్తున్నారు. మహిళా చీఫ్‌ను నియమించాలనే కాంగ్రెస్ ఎత్తుగడ హిమాచల్ రాష్ట్రంలో ఉన్న సగం మంది మహిళా జనాభా నుంచి మద్దతు పొందవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. 66 ఏళ్ల ప్రతిభ మండీ నుంచి మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. 


Updated Date - 2022-04-27T13:45:45+05:30 IST