Tangirala sowmya: కొడాలి నాని ఇంకా క్లీనర్ భాష మార్చుకోలేదు

ABN , First Publish Date - 2022-09-09T17:32:37+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆధ్వర్యంలో టీడీపీ నిరసన చేపట్టింది.

Tangirala sowmya: కొడాలి నాని ఇంకా క్లీనర్ భాష మార్చుకోలేదు

అమరావతి: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య (Tangirala sowmya) ఆధ్వర్యంలో టీడీపీ (TDP) నిరసన చేపట్టింది. టీడీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), లోకేష్‌(Lokesh)పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై నిరసనగా సౌమ్య ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ... ‘‘కొడాలి నాని (Kodali nani) ఇంకా నీ క్లీనర్ భాష మార్చుకోలేదు. ఎమ్మెల్యే, మంత్రి అయ్యాక కూడా నీ క్లీనర్ భాష మార్చుకోవడం లేదు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు. భువనేశ్వరి, లోకేష్ మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.  మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద మాట్లాడితే నువ్వు ఏ విధంగా స్పందిస్తావు. ఇప్పటికైనా నీ భాష మార్చుకోలేకపోతే ప్రజలు నీకు బుద్ధి చెబుతారు’’ అంటూ హెచ్చరించారు. చెన్నుపాటి గాంధీ (Chennupati gandhi)పై జరిగిన దాడిని ఖండిస్తున్నానని... పోలీసులు వ్యవహరించిన తీరు సరైన పద్ధతి కాదని అన్నారు. పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించవద్దని రానున్న రోజులు ప్రైవేట్ కేసులు వేస్తామని తంగిరాల సౌమ్య హెచ్చరించారు. 

Updated Date - 2022-09-09T17:32:37+05:30 IST