Advertisement

ట్రంప్ ప్లాజా హోటల్‌ను కూల్చేయనున్నాం: మేయర్

Jan 24 2021 @ 12:26PM

అట్లాంటిక్ సిటి: న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో ఉన్న ట్రంప్ ప్లాజా హోటల్‌ను ఫిబ్రవరి 17న కూల్చేయనున్నట్టు సిటీ మేయర్ మార్టీ స్మాల్ వెల్లడించారు. ట్రంప్ ప్లాజా హోటల్‌ను మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 1984లో నిర్మించుకున్నారు. 2009 వరకు ఈ హోటల్‌లో భాగస్వామిగా ఉన్న ట్రంప్ అనంతరం తన షేర్‌ను అమ్మేశారు. ప్రస్తుతం ఈ హోటల్‌కు కార్ల్ ఇకాన్ అనే వ్యక్తి యజమానిగా ఉన్నారు. 2009 నుంచి 2014 వరకు విజయవంతంగా నడిచిన ఈ హోటల్‌‌ను వివిధ కారణల వల్ల మూసివేయాల్సి వచ్చింది. 


ప్రస్తుతం ఈ హోటల్ పడిపోయే స్థితిలో ఉందని, అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా తామే హోటల్‌ను కూల్చివేస్తున్నట్టు యజమాని కార్ల్ తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం 9 గంటలకు కూల్చివేత కార్యక్రమం జరుగుతుందని ఆయన అన్నారు. అధ్యక్షుడి బాధ్యతల నుంచి గత బుధవారం ట్రంప్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో కూల్చివేత ప్రకటన రావడంతో ఈ అంశం చర్చనీయాంశం అయింది. అయితే ట్రంప్‌కు, ఈ కూల్చివేతకు ఎటువంటి సంబంధం లేదంటూ కార్ల్ స్పష్టం చేశారు. చాలా మంది తనను ఇదే ప్రశ్న అడుగుతున్నారని, భవనం పడిపోయే స్థితిలో ఉండటం వల్ల కూలుస్తున్నట్టు వివరించారు.

Follow Us on:
Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.