Ukrainian మాజీ ఎంపీ భార్య నగదుతో పారిపోయేందుకు యత్నం

ABN , First Publish Date - 2022-03-21T16:27:24+05:30 IST

ఉక్రెయిన్ దేశం నుంచి మాజీ ఎంపీ భార్య 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోల నగదుతో దేశం విడిచి పారిపోతుండగా సరిహద్దుల్లో గార్డులు పట్టుకున్న ఘటన...

Ukrainian మాజీ ఎంపీ భార్య నగదుతో పారిపోయేందుకు యత్నం

హంగేరి సరిహద్దుల్లో పట్టుకున్న గార్డులు

కైవ్: ఉక్రెయిన్ దేశం నుంచి మాజీ ఎంపీ భార్య 28 మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోల నగదుతో దేశం విడిచి పారిపోతుండగా సరిహద్దుల్లో గార్డులు పట్టుకున్న ఘటన సోమవారం వెలుగుచూసింది.ఉక్రెయిన్ మాజీ పార్లమెంటు సభ్యుడు కోట్విట్స్కీ భార్య సూట్ కేసుల్లో 28మిలియన్ డాలర్లు, 1.3 మిలియన్ యూరోల నగదుతో దేశం విడిచి పారిపోవడానికి యత్నించింది. రష్యా సైనిక దాడి నేపథ్యంలో మాజీ ఎంపీ భార్య భారీ డబ్బుతో ఉక్రెయిన్ సరిహద్దులు దాటి హంగేరీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా సరిహద్దు గార్డులు ఆమెను అడ్డుకున్నారు.మాజీ ఎంపీ భార్య ఉక్రెయిన్‌ దేశం నుంచి తప్పించుకుని జకర్‌పట్టియా ప్రావిన్స్ మీదుగా హంగేరీలోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. 


ఆమెను సరిహద్దుల వద్ద హంగేరియన్ సరిహద్దు గార్డులు పట్టుకొని నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధం వల్ల ఇప్పటికే 10 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పలువురు ఉక్రెయిన్లు పోలాండ్, స్లోవేకియా, రొమేనియా, హంగేరి వంటి పొరుగుదేశాలకు పారిపోయారు. 


Updated Date - 2022-03-21T16:27:24+05:30 IST