నేను 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను..ప్రముఖ tennis మాజీ క్రీడాకారిణి వెల్లడి

ABN , First Publish Date - 2022-06-25T16:21:29+05:30 IST

అమెరికా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఆండ్రియా జేగర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు....

నేను 30 సార్లు లైంగిక వేధింపులకు గురయ్యాను..ప్రముఖ tennis మాజీ క్రీడాకారిణి వెల్లడి

వాషింగ్టన్ : అమెరికా మాజీ టెన్నిస్ క్రీడాకారిణి ఆండ్రియా జేగర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను 30 సార్లు లైంగిక వేధింపులకు గురైనట్లు ఆండ్రియా జేగర్ వెల్లడించింది.భుజం గాయం కారణంగా పదవీ విరమణ చేయడానికి ముందు 10 కెరీర్ టైటిళ్లను గెలుచుకుంది.1980వ సంవత్సరంలో మహిళా టెన్నిస్ అసోసియేషన్ సిబ్బంది తనను కనీసం 30 సార్లు లైంగికంగా వేధించారని అమెరికన్ ఆండ్రియా జేగర్ చెప్పారు.1982 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనలిస్ట్ అయిన తనను 16 సంవత్సరాల వయస్సులో అసోసియేషన్ సిబ్బంది మద్యం తాగి తనను ముద్దాడారని దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు చేశారు.


తాను టోర్నమెంట్లలో పాల్గొన్నపుడు అసోసియేషన్ అధికారులు ఆల్కహాలిక్ డ్రింక్స్ ఇచ్చి లైంగికంగా వేధించారని జేగర్ వివరించారు.1982 ఫ్రెంచ్ ఓపెన్, 1983 వింబుల్డన్‌లలో జేగర్ రన్నరప్‌గా నిలిచింది. 


Updated Date - 2022-06-25T16:21:29+05:30 IST