రైతు పొట్టకొట్టి కార్పొరేట్లకు కోట్లు కట్టబెడతారా..

ABN , First Publish Date - 2021-03-07T05:10:42+05:30 IST

రైతుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కోట్లు రూపాయలు కట్టబెట్టేందుకు మోడీ చూస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ప్రజలంతా వ్యతిరేకించాలని కౌలు రైతుల సంఘం డెల్టా జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయు లు అన్నారు.

రైతు పొట్టకొట్టి కార్పొరేట్లకు కోట్లు కట్టబెడతారా..
తుందుర్రులో నిరసన వ్యక్తం చేస్తున్న కౌలు రైతులు

భీమవరం రూరల్‌, మార్చి 6: రైతుల పొట్టకొట్టి కార్పొరేట్లకు కోట్లు రూపాయలు కట్టబెట్టేందుకు మోడీ చూస్తున్నారని, బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను ప్రజలంతా వ్యతిరేకించాలని కౌలు రైతుల సంఘం డెల్టా జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయు లు అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటం వంద రోజులైన సందర్భంగా కిసాన్‌ సంఘం పిలుపులో భాగంగా జిల్లాలో పలు గ్రామాల్లో శనివారం రైతు జెండాలను ఎగురవేశారు. తుందుర్రులో జెండా ఆవిష్కరణలో రామాంజనేయులు మా ట్లాడుతూ మరో స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తూ ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి విదేశాలు స్పందించినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. నల్ల చట్టాలను రద్దు చేసి రైతాంగంపై నిర్బంధం ఆపకపోతే బీజేపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో కోయ పెద్దిరాజు, రైతులు ఆరేటి వేణు, వలవల నారాయణరావు, మంచెం శ్రీరామమూర్తి, కామిశెట్టి శ్రీను, ఆకుల వెంకట్వేర్లు, దొంగ శ్రీరాములు, కాండ్రెగులు వెంకటరెడ్డి, పాలపర్తి శ్రీను పాల్గొన్నారు.


వీరవాసరం : ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో వీరవాసరంలో జెండా ఆవిష్కరించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్రాపు నారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు చట్టాలను రద్దు చెయ్యాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతాంగం ఉద్యమం చేపట్టి వంద రోజులు పూర్తయిందన్నారు తీవ్రమైన చలి, ప్రతికూల వాతావరణంలో ఇప్పటికి 248 మంది రైతులు చనిపోయారని, అయినప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించక పోవడం దారుణమన్నారు. ఉద్యమానికి మద్దతు పెరుగుతోందన్నారు. కార్య క్రమంలో ఆకుల హరే రామ్‌, జుత్తిగ నరసింహమూర్తి, చింతపల్లిలక్ష్మి కుమారి, జుత్తిగ సాంబయ్య, యాతం రాంబాబు, కొప్పిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:10:42+05:30 IST