నలభై రెండా? ఇరవై రెండా?

ABN , First Publish Date - 2021-03-28T05:53:19+05:30 IST

మంజూ వారియర్‌... మలయాళంలో ప్రముఖ కథానాయిక. ఆమె వయసెంతో తెలుసా? 42! అయితే, ఇటీవల కేరళలో జరిగిన ‘చతుర్‌ముఖం’ ప్రెస్‌మీట్‌కి వచ్చిన మంజూ వారియన్‌ను చూస్తుంటే...

నలభై రెండా? ఇరవై రెండా?

మంజూ వారియర్‌... మలయాళంలో ప్రముఖ కథానాయిక. ఆమె వయసెంతో తెలుసా? 42! అయితే, ఇటీవల కేరళలో జరిగిన ‘చతుర్‌ముఖం’ ప్రెస్‌మీట్‌కి వచ్చిన మంజూ వారియన్‌ను చూస్తుంటే... అంత వయసున్నట్టు కనిపించడం లేదని నెటిజన్లు అంటున్నారు. బ్లాక్‌ స్కర్టు... వైట్‌ షర్టు... కొత్త హెయిర్‌ స్టయిలు... ట్రెండీ లుక్‌లో వచ్చారామె. ఆ ఫొటోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. మంజూ వారియర్‌ నలభైల్లో ఉన్నట్టు లేరనీ, ఇరవైల్లో ఉన్నట్టు ఉన్నారని ప్రశంసిస్తున్నారు. రోజు రోజుకూ యంగ్‌ లుక్‌లోకి వస్తున్నారని చెబుతున్నారు. అదీ సంగతి!

Updated Date - 2021-03-28T05:53:19+05:30 IST