ltrScrptTheme3

కుల్పకూలిన హెలికాప్టర్.. నలుగురు మృతి

Aug 2 2021 @ 11:24AM

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో అందులో ప్రయాణిస్తున్న నలుగు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ది రాబిన్సన్ ఆర్66 అనే హెలికాప్టర్ ఆదివారం రోజు మధ్యాహ్నం సుమారు 1.15 గంటల సమయంలో శాక్రమెంటోకు ఉత్తరాన ఉన్నకొలూసా కౌంటీ ప్రాంతంతో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న మృత్యువాతపడ్డారు. ఈ విషయాన్ని ఫెడరల్ ఏవిషేయన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే ప్రమాదంలో మరణించిన వారి వివరాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ఈ ఘటనపై ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు దర్యాప్తు ప్రారంభించాయి.


Follow Us on:

అమెరికా నగరాల్లోమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.