పలు దొంగతనాల కేసుల్లో నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-23T06:41:17+05:30 IST

ఇంకొల్లుతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడిన నిందితులు ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.15 లక్షల వి లువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. ఈ సం దర్భంగా ఇంకొల్లు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్బారావు కేసు పూర్వాపరాలు వివరించారు.

పలు దొంగతనాల కేసుల్లో నిందితుల అరెస్టు
నిందితుల వివరాలను వెల్లడిస్తున్న సీఐ సుబ్బారావు

రూ.2.15 లక్షల చోరీ సొత్తు రికవరీ


ఇంకొల్లు(చీరాల), జూన్‌ 22 : ఇంకొల్లుతోపాటు ఇతర ప్రాంతాల్లో కూడా చోరీలకు పాల్పడిన నిందితులు ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి నుంచి రూ.2.15 లక్షల వి లువైన చోరీ సొత్తును రికవరీ చేశారు. ఈ సం దర్భంగా ఇంకొల్లు పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సుబ్బారావు కేసు పూర్వాపరాలు వివరించారు. ప ర్చూరు మండల నూతలపాడుకు చెందిన కంభం పాటి సాంబశివరావు, చీరాల మండలం ఇందిరా నగర్‌కు చెందిన కావటి సురేంద్ర, గుంటూరు మి ర్చి యార్డు సమీపంలో నివసించే ముప్పిడి వెం కటేష్‌లు ఐదు చోరీ కేసుల్లో నిందితులు. వారిలో ముప్పిడి వెంకటేశ్వర్లు, కావటి సురేంద్రలు జల్సా లకు అలవాటుపడి డబ్బు కోసం చోరీలకు పాల్ప డే వారుగా గుర్తించారు. వీరు ఇంకొల్లు మండ లం పూసపాడు పెట్రోలు బంకు వద్ద ఈ ఏడాది మే 18న  కావురాజు శ్రీకాంత్‌ బైక్‌ను, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఒక బైకును దొంగలించా రు. వీటితో పాటు సెల్‌ఫోన్లు చోరీ చేశారు. వాటి ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకుని బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో పర్చూరు మండలం నూతలపాడుకు చెం దిన కంభంపాటి సాంబశివరావు పలువురి రైతు లకు చెందిన కల్టివేటర్‌లను దొంగలించాడు. ఫౌం డ్రీ నిర్వాహకుడు అరీఫా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంకొల్లు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని అరెస్టు చేసి, కల్టివేటర్లు మొత్తం రూ.2.15లక్షల విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసు కున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తా మని సీఐ చెప్పారు. నిందితులను పట్టుకోవటం తో పాటు వస్తువులను రికవరీ చేసిన సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఎస్సై ఎన్‌ సీ.ప్రసాద్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ వసంతరావు, కో టేశ్వరరావు, సుధాకరరావు, బాలచంద్ర, నాగూర్‌, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


బైక్‌ల చోరీ కేసులో... 


చీరాలటౌన్‌: ఇంటి ముందు ఉంచిన ద్విచక్ర వాహనాలను దొంగిలించిన కేసుల్లో నిందితుడ్ని చీరాల వన్‌టౌన్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కే సుకు సంబంధించిన వివరాలను స్టేషన్‌ ప్రాంగ ణంలో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శ్రీకాంత్‌ వెల్లడించా రు. తమ ద్విచక్ర వాహనాలు అపహరణకు గుర య్యాయని గత నెల 31న అచ్చుల కృష్ణమూర్తి, ఈనెల 20న షేక్‌ మహ్మద్‌లు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దర్యాప్తు చేయగా వేటపాలెం మండ లం లక్ష్మీపురానికి చెందిన జ్యోతి శామ్యూల్‌ ఈ దొంగతనాలను చేసినట్లు గుర్తించామన్నారు. మ ంగళవారం అతడు ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.  అంతేకాకుండా నాలుగు  ద్విచక్ర వాహనాలు, ఒక మోపెడ్‌, టీవీని స్వాధీ నం చేసుకున్నట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాల వరుస దొంగతనాలతో బెంబేలెత్తిస్తున్న నిందితు డిని చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న ఎస్సై నాగశ్రీను, హెడ్‌కానిస్టేబుల్స్‌ లక్ష్మణ్‌, కృష్ణారెడ్డి, పీసీలు రమేష్‌, సీతారామయ్యలను డీఎస్పీతోపా టు సీఐ రాజమోహన్‌లు అభినందించారు.


Updated Date - 2021-06-23T06:41:17+05:30 IST