Delhiలో 14 మంది పిల్లలు కరోనాతో ఆసుపత్రి పాలు

ABN , First Publish Date - 2022-04-16T17:52:15+05:30 IST

ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో కొవిడ్‌తో ఆసుపత్రి పాలైన 53 మందిలో 14 మంది పిల్లలు ఉన్నారు...

Delhiలో 14 మంది పిల్లలు కరోనాతో ఆసుపత్రి పాలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఢిల్లీలో కొవిడ్‌తో ఆసుపత్రి పాలైన 53 మందిలో 14 మంది పిల్లలు ఉన్నారు.  చాలా మంది పిల్లలకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది.ఆసుపత్రిలో కరోనాతో చేరిన వారిలో ఎక్కువ మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు.14 మంది చిన్నారులు శనివారం ఉదయం ఢిల్లీలో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 12 మందిని ఢిల్లీలోని కళావతి సరన్ ఆసుపత్రిలో చేర్చారు.శుక్రవారం ఢిల్లీలో 3.95 శాతం పాజిటివ్ రేటుతో 366 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధానిలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం చెపుతోంది.ఢిల్లీ విద్యా డైరెక్టరేట్ శుక్రవారం విద్యార్థులకు కొవిడ్ మార్గదర్శకాలను జారీ చేసింది. ఢిల్లీలో కరోనా కేసులు పెరిగితే పాఠశాలలను పాక్షికంగా పాఠశాలలను మూసివేస్తామని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు.


Updated Date - 2022-04-16T17:52:15+05:30 IST