కొనసాగుతున్న కర్ఫ్యూ

ABN , First Publish Date - 2021-05-09T05:20:56+05:30 IST

మండల కేంద్రమైన రుద్రవరంలో నాలుగో రోజు శనివారం కర్ఫ్యూ కొనసాగింది.

కొనసాగుతున్న కర్ఫ్యూ
రుద్రవరంలో నిర్మానుష్యంగా రహదారి

  1. రహదారులన్నీ నిర్మానుష్యం


రుద్రవరం, మే 8: మండల కేంద్రమైన రుద్రవరంలో నాలుగో రోజు శనివారం కర్ఫ్యూ కొనసాగింది. మధ్యాహ్నం 12 గంటలు తరువాత రోడ్లపై జనం తిరగలేదు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. కరోనా సెకండ్‌వే విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా రోడ్లపై వచ్చేందుకు జంకుతున్నారు. గ్రామాల్లో  ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి సూచించారు.


చాగలమర్రి: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. శనివారం ఎస్‌ఐ మారుతీ, పోలీసులు కర్ఫ్యూ తీరును పరిశీలించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించి భౌతికదూరం పాటించాలని అన్నారు. మాస్క్‌ లేని వారికి జరిమాన విధిస్తామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే షాపులు తెరవాలని అన్నారు. 12 గంటల సమయంలో పోలీసులు దుకాణాలు మూసి వేయాలని మైకుల ద్వారా తెలియజేశారు. దీంతో ప్రధాన రహదారులు నిర్మాణుష్యంగా మారాయి. 


ఓర్వకల్లు: వ్యక్తిగత రక్షణతోనే కరోనా నివారణ సాధ్యమని తహీసల్దార్‌ శివరాముడు, ఎస్‌ఐ వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం మండలంలోని సోమయాజులపల్లె, కాల్వ, హుశేనాపురం, ఓర్వకల్లు, నన్నూరు తదితర గ్రామాల్లో వారు కర్ఫ్యూను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజురోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తుందన్నారు. దీని నివారణ వ్యక్తిగత రక్షణతోనే సాధ్యమన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. భౌతిక దూరం, శానిటైజర్స్‌, మాస్కులను, తప్పకుండా ధరించాలన్నారు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత విధించిన కర్ఫ్యూ నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. హోటళ్లు, కిరాణ షాపులు అన్నీ మూసివేయాలన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించాలని వారు సూచించారు.  

Updated Date - 2021-05-09T05:20:56+05:30 IST