నాలుగో ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2022-08-10T05:42:17+05:30 IST

తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో మంగళవారం సాయంత్రం బోర్డు కార్యదర్శి నాగమోహన నాలుగో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

నాలుగో ప్రమాద హెచ్చరిక
33 గేట్ల ద్వారా నదిలోకి విడుదలవుతున్న నీరు

రాయదుర్గం, ఆగస్టు 9: తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో మంగళవారం సాయంత్రం బోర్డు కార్యదర్శి నాగమోహన నాలుగో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నదీ పరివాహక దిగువ ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్యాంలోకి 1,48,400 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇనఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా దిగువకు రెండు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం 25 గేట్లను 3.5 అడుగులు, 8 గేట్లను రెండు అడుగులు ఎత్తి, 33 గేట్ల ద్వారా 1,54,023 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. డ్యామ్‌లో 101.031 టీఎంసీల నీటిని నిల్వ చేశారు. 



Updated Date - 2022-08-10T05:42:17+05:30 IST