వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2021-03-06T04:54:31+05:30 IST

మండల పరిధిలోని శెట్టిపల్లెలో వైపీసీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
పోటాపోటీగా ఇరువర్గాలు తోలిన కంకర

సిమెంటు రోడ్డు పనులు చేపట్టేందుకు మోహరించిన ఇరువర్గాలు  

ఉద్రిక్తంగా పరిస్థితి

పోలీసుల జోక్యంతో సర్దుమనిగిన వివాదం


సంబేపల్లె, మార్చి 5: మండల పరిధిలోని శెట్టిపల్లెలో వైపీసీ నేతల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. సిమెంటు రోడ్డు నిర్మాణ పనుల విషయమై ఇరువర్గాల వారు పంతానికి పోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.. వివరాల్లోకి వెళితే... శెట్టిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని బుర్రవాండ్లపల్లెకు రూ.2లక్షలతో 120 మీటర్ల సిమెం టు రోడ్డు మంజూరైంది. శుక్రవారం ఈ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టేందుకు మాజీ జడ్పీటీసీ సభ్యుడు ఉపేంద్రారెడ్డి వర్గం, వైసీపీ నేత బ్రహ్మానందరెడ్డి వర్గం వారు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే తమ వర్గానికి పని చెప్పారని ఒక వర్గం వారు.. కాదు మాకే పనులు చేయమని చెప్పారని మరో వర్గం వారు పంతానికి దిగారు. ఇరువర్గాల వారు బుర్రవాండ్లపల్లె వద్ద సిమెంటు, ఇసుక, కంకర దించి పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మాట మాట పెరిగి వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల వారికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీంతో గొడవ సర్దుమనిగింది. ప్రస్తుతానికి సిమెంటు రోడ్డు పనులు నిలిచి పోయాయి.

Updated Date - 2021-03-06T04:54:31+05:30 IST