సుగంధ పరిమళాల జాతర

Published: Mon, 28 Mar 2022 00:37:06 ISTfb-iconwhatsapp-icontwitter-icon
సుగంధ పరిమళాల జాతర ఉపమాక జాతరలో విక్రయాలకు ఉంచిన సుగంధ ద్రవ్యాలు


  ఉపమాక తీర్థంలో మసాలా ఘుమఘుమలు 

 సెంటిమెంటుగా కొంటున్న భక్తులు

నక్కపల్లి, మార్చి 27 :  ప్రతి ఇంటా ఏ వంట చేయాలన్నా సుగంధ ద్రవ్యాలు తప్పనిసరి. ఇంట్లో నగదు, నగలూ.. ఉన్నా లేకపోయినా.. వంట గదిలో సరిపడే సరుకులే గృహిణులు ఎంతో ముఖ్యంగా భావిస్తుంటారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో ఉపమాకకు  గుర్తింపు ఉంది. ప్రతి సంవత్సరం వెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాల ముందు రోజు నుంచి 20 రోజులు అంటే కొత్త అమావాస్య ముందు రోజు వరకూ జోరుగా ఉపమాక జాతరలో ఈ వ్యాపారం సాగుతుంది. అందుకే ఉపమాక ఆలయానికి వచ్చే భక్తులు సెంటిమెంట్‌ ప్రకారం స్వామివారి సన్నిధిలో ఈ దినుసులు కొని తీసుకెళ్లాలనుకుంటారు. పూర్వం నుంచి ఉపమాక జాతరకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాలు, పండుగలు జరిగేటప్పుడు ఎక్కడైనా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే తీర్థాలు జరుగుతాయి. కానీ ఉపమాకలో మాత్రం వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాల నుంచి ఇరవై రోజుల పాటు ఏటా స్వామివారి తీర్థం సాగడం ఆనాయితీగా వస్తోంది. ఈ ఏడాది వ్యాపారం బాగా సాగుతున్నట్టు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.