
- ఓటీపీ తెలుసుకుని రూ.68 వేలు తస్కరణ
హైదరాబాద్ సిటీ/సరూర్‌నగర్ : సోనూసూద్ (Sonu Sood) ఫౌండేషన్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఓ మహిళ (Women) బ్యాంకు ఖాతా ఓటీపీ నంబర్ తెలుసుకుని రూ.68వేలు దోచుకున్నాడు. ఈ సంఘటన మీర్‌పేట్ పోలీసుస్టేషన్ (Police Station) పరిధిలో జరిగింది. గుర్రంగూడలోని శ్రీనివాసపురం కాలనీకి చెందిన పి.సంధ్య(36) బంధువుల్లో ఒకరికి కేన్సర్ (Cancer Treatment) చికిత్స కోసం డబ్బు అవసరం పడింది. దీంతో ఆమె ట్విటర్‌లో సోనూసూద్ ఫౌండేషన్‌కు (Foundation) ట్వీట్ చేశారు. గమనించిన గుర్తు తెలియని వ్యక్తి (Unknown person) ఈనెల 9న ‘07908197291’ నంబర్ నుంచి కాల్ చేసి, తాను సోనూసూద్ ఫౌండేషన్ నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు.
బంధువు వివరాలు అడిగినట్టుగా నమ్మించి, అనంతరం ‘ఎనీ డెస్క్ యాప్’ (Any Desk)డౌన్‌లోడ్ చేసుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్‌పే (Phone Pay App) యాప్‌లోకి వెళ్లి బ్యాంకు డెబిట్ కార్డును రెండు వైపులా స్కాన్ చేయమని చెప్పగా, ఆమె అలాగే చేసింది. అనంతరం తమ ఫౌండేషన్ నుంచి డబ్బు పంపిస్తామని, మొబైల్‌కు వచ్చే ఓటీపీ చెప్పాలని సూచించాడు. దాంతో ఆమె ఓటీపి చెప్పగానే ఆమె అకౌంట్ (Account) నుంచి మూడు దఫాలుగా రూ.68వేలు డ్రా చేసుకున్నాడు. మోసపోయానని గ్రహించిన సంధ్య శనివారం మీర్‌పేట్ పోలీసులకు (Police) ఫిర్యాదు చేసింది.