ఆగంతుకుడి నుంచి యువతికి ఫోన్‌.. ట్రాక్‌ రికార్డ్‌ బాగుందని చెప్పి..

ABN , First Publish Date - 2021-07-03T14:45:31+05:30 IST

ఇటీవల ఒక ఆగంతుకుడు ఫోన్‌ చేసి మీ జాబ్‌ ట్రాక్‌ రికార్డ్‌ బాగుందని...

ఆగంతుకుడి నుంచి యువతికి ఫోన్‌.. ట్రాక్‌ రికార్డ్‌ బాగుందని చెప్పి..

  • రుణాల ఏజెన్సీ పేరుతో యువతికి టోకరా


హైదరాబాద్/హిమాయత్‌నగర్‌ : బ్యాంకు రుణాల మార్కెటింగ్‌ ఏజెన్సీ ఇప్పిస్తామని ఓ యువతిని ట్రాప్‌ చేసిన కేటుగాళ్లు లక్షకు పైగా నొక్కేశారు. నగరానికి చెందిన ప్రియాంక గతంలో పలు సంస్థలలో కష్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటీవ్‌గా పనిచేసింది. ఇటీవల ఒక ఆగంతుకుడు ఫోన్‌ చేసి మీ జాబ్‌ ట్రాక్‌ రికార్డ్‌ బాగుందని, వివిధ బ్యాంకులలో వ్యక్తిగత, గృహ రుణాలకు సంబంధించిన ఏజెన్సీలు ఇప్పిస్తానని, తద్వారా సొంతంగా బిజినెస్‌ చేసుకోవచ్చని నమ్మబలికాడు. అయితే ముందుగా లక్ష వరకు వివిధ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నాడు. దీనికి ఆమె అంగీకరించి రూ.80వేలు ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ తర్వాత మళ్లీ ఫోన్‌ చేసి లోన్లు కావాలనుకునే కష్టమర్ల నుంచి ప్రాసెసింగ్‌ ఫీజు వసూలు చేస్తే మిగతా డబ్బు సులువుగా సమకూరుతుందని నమ్మించాడు. అతడు చెప్పినట్లే ఆమె పలువురు కష్టమర్ల నుంచిడబ్బులు సేకరించి ట్రాన్స్‌ఫర్‌ చేసింది. ఆ వెంటనే కేటుగాడు ఫోన్లు స్విచ్చాఫ్‌ చేశాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైబర్‌క్రైమ్స్‌లో ఫిర్యాదు చేసింది. మొత్తం రూ.1.12లక్షలు మోసపోయినట్లుగా ఫిర్యాదులో పేర్కొంది.

Updated Date - 2021-07-03T14:45:31+05:30 IST