మల్టీ మీడియా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2021-07-25T11:49:06+05:30 IST

ఈ నెల 28లోగా హెల్ప్‌లైన్‌ నెంబరు 8567856754 లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు.తరగతులు ఆగస్ట్‌ 1 నుంచి ప్రారంభమవుతాయి...

మల్టీ మీడియా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ

హైదరాబాద్ సిటీ/ఖైరతాబాద్‌ : అభయ ఫౌండేషన్‌ ‘అభయ సహాయ’ అనే కార్యక్రమం పేరిట గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు 3 నెలలపాటు మల్టీ మీడియా, గ్రాఫిక్‌ డిజైనింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనుంది.  ప్రతిభ గల వారికి నియామకాలు కల్పించనున్నట్లు ఫౌండేషన్‌ నిర్వాహకులు బాలచంద్ర, శివకృష్ణ తెలిపారు. ఈ శిక్షణ 3 నెలల పాటు హైదరాబాద్‌లో ఉంటుందని, శిక్షణ సమయంలో ఉచిత వసతి, భోజనం కల్పించబడుతుందని తెలిపారు. ఈ నెల 28లోగా హెల్ప్‌లైన్‌ నెంబరు 8567856754 లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. తరగతులు ఆగస్ట్‌ 1 నుంచి ప్రారంభమవుతాయి.

Updated Date - 2021-07-25T11:49:06+05:30 IST