ఈ నంబర్లకు కాల్ చేస్తే ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు

ABN , First Publish Date - 2021-05-10T17:02:29+05:30 IST

ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్న వారికి

ఈ నంబర్లకు కాల్ చేస్తే ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్లు

హైదరాబాద్/మదీన : ఆక్సిజన్‌ అందక ఇబ్బందులు పడుతున్న వారికి కుంభమేళా అగర్వాల్‌ బంధు, అశోక్‌ ఫౌండేషన్‌ సంయుక్తాధ్వర్యంలో ఉచితంగా సిలిండర్లను అందిస్తున్నారు. బహదూర్‌పురాలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అశోక్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు పంకజ్‌ కుమార్‌ అగర్వాల్‌ ఈ విషయం తెలిపారు. ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమున్నవారు 79897 71272, 92465 50088 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న వారికి కరోనా కిట్లు, ఆయుర్వేద మందులు కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు.

Updated Date - 2021-05-10T17:02:29+05:30 IST