ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత పోలీసు శిక్షణ

ABN , First Publish Date - 2020-10-28T11:03:52+05:30 IST

నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదివి ఉత్తీర్ణులైన బాలుర విద్యార్థులకు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కు పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగాల

ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచిత పోలీసు శిక్షణ

ఇంటర్‌ పూర్తిచేసిన వారు.. ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు

ఈనెల 31 దరఖాస్తుకు చివరి తేది

నిజామాబాద్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఒడ్డెన్న


నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 27: నిజామాబాద్‌ జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ చదివి ఉత్తీర్ణులైన బాలుర విద్యార్థులకు, ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల కు పోలీసు శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగాల ఎంపిక కోసం ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. ఇంట ర్మీడియట్‌ విద్యాశాఖ ఆదేశాల మేరకు మంగళవారం డీఐఈవో కార్యాలయంలో ఆయన ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పోలీసు కానిస్టేబుళ్ల ఎంపిక నిమిత్తం ఉచితంగా శారీరక దారుఢ్య, రాతపరీక్ష కోసం సబ్జెక్టులలో ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివి ఉత్తీర్ణులైన బాలురు, 167.6 సెంటి మీటర్ల ఎత్తు,  86.3 సెంటి మీటర్ల చాతి, గాలి పీల్చినప్పుడు మరో 5 సెంటీ మీటర్లు అదనంగా ఉన్న విద్యార్థులు అర్హులున్నారు. పై అర్హతలున్న వారు జిల్లా కేంద్రంలోని ఖిల్లా బాలుర కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎంపికైన విద్యార్థులకు రన్నింగ్‌, హై జంప్‌, లాంగ్‌ జంప్‌, రాత పరీక్షలలో వివిధ సబ్జెక్టులలో నిష్ణాతులైన వారిచేత శిక్షణ ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తుతో పాటు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటో లు, ఎస్సెస్సీ, ఇంటర్‌ మెమోలు,  బోనఫైడ్‌, కుల ధృవీకరణ పత్రాలు జత చేయాలని ఆయన తెలిపారు. ఇతర వివరాల కోసం ప్రిన్సిపల్‌ యకీనుద్ధీ న్‌ 99481 64514 నెంబర్‌ను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2020-10-28T11:03:52+05:30 IST