అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్‌: బీసీ

ABN , First Publish Date - 2021-12-03T05:27:29+05:30 IST

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ట్రేషన్‌: బీసీ
విలేకరులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, డిసెంబరు 2: టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదల కు ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ పేరుతో పేదల రక్తాన్ని పీలుస్తున్నారని అన్నారు. అధికారులకు టార్గెట్‌లు పెట్టడంతో డబ్బు చెల్లించకుంటే సంక్షేమ పథకాలు ఆపివేస్తామని బెదిరిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని విమర్శించారు. ఎవరైనా ప్రశ్నిస్తే చర్యలు తీసు కోవాలని సీఎం ఆదేశించడం సిగ్గు చేటన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత ఆదా యాలు పెంచుకుంటూ ముఖ్యమంత్రిని కలిసే ధైర్యం చేయలేకపోతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా పేదల నుంచి వసూళ్లు ఆపి ఉచితంగా రిజిస్ట్రేషన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ మైనర్టీ అధ్యక్షుడు జాహిద్‌హుస్సేన్‌, బురానుద్దీన్‌,  సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, దొనపాటి భాస్కర్‌రెడ్డి, బొబ్బల గోపాల్‌రెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, రాయలసీమసలాంలు పాల్గొన్నారు. 

- డోన్‌ టీడీపీ ఇంచార్జి ధర్మారం సుబ్బారెడ్డి బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డిని గురువారం మర్యాద పూర్వకంగా కలుసుకొని గజమాలతో సత్కరించారు. ప్రస్తుత రాజకీయాలపై ఇరువురు చర్చలు జరిపారు. డోన్‌ నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై వారిరువురు చర్చించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కమలాపురం సర్పంచ్‌ అర్జున్‌రెడ్డి, మురళీకృష్ణగౌడ్‌, విజయభాస్కర్‌, వలసల రామకృష్ణ, తిరుమలేశ్‌చౌదరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-03T05:27:29+05:30 IST