అమ్మాయిలకు ఆరోగ్యం

ABN , First Publish Date - 2021-03-06T09:07:50+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి

అమ్మాయిలకు ఆరోగ్యం

విద్యార్థినులకు ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌

ప్రభుత్వ బడుల్లో చదివే వారికి మాత్రమే

ఎల్లుండి ప్రారంభం.. జూలై నుంచి అమలు

ఏప్రిల్‌ 15 నాటికి టెండర్లు.. కంపెనీలతో డీల్‌

ల్యాప్‌టాప్‌ ద్వారా పోటీ పరీక్షల్లో శిక్షణ

అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌


అమరావతి, మార్చి5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఈ అంశంపై జగన్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న ఏడు నుంచి 12వ తరగతి వరకూ విద్యార్థినులకు బ్రాండెడ్‌ శానిటరీ నేప్‌కిన్స్‌ ఉచితంగా అందించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ‘‘మహిళా దినోత్సవం రోజున ఉచిత శానిటరీ నేప్‌కిన్స్‌ పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తాం. ఏప్రిల్‌ 15 నాటికి టెండర్ల ప్రక్రియను అధికారులు పూర్తి చేయాలి.


ఆ నెలాఖరు నాటికి  ప్రతిష్ఠాత్మకమైన  కంపెనీలతో సెర్ప్‌, మెప్మా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ ఏడాడి జూలై ఒకటో తేదీ నుంచి ప్రతి నెలా ఉచితంగా వాటిని అందజేస్తాం’’ అని సీఎం వివరించారు. కాగా, పోటీ పరీక్షలు రాసే విద్యార్థినులకు అత్యుత్తమ శిక్షణ అందించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. దీనికోసం ల్యాప్‌టా్‌పలు వాడుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-03-06T09:07:50+05:30 IST