ఉచిత సేవలు మోటార్‌ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి రావు: ఐఆర్‌డీఏఐ

Published: Fri, 20 May 2022 03:20:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఉచిత సేవలు మోటార్‌ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి రావు: ఐఆర్‌డీఏఐ

న్యూఢిల్లీ: మోటారు ఇన్సూరెన్స్‌పై బీమా నియంత్రణ మండలి ఐఆర్‌డీఏఐ మరింత స్పష్టత ఇచ్చింది. వాహనాల పికప్‌, డ్రాపింగ్‌ వంటి ఉచిత సేవలు బీమా కవరేజీ పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బీమా కంపెనీలు ఈ ఉచిత సేవలను బీమా కవరేజీలో భాగమని తమ ప్రకటనల్లో చేర్చవద్దని కోరింది. బాడీ వాష్‌, ఇంటీరియర్‌ క్లీనింగ్‌, వాహనాల తనిఖీలు కూడా బీమా కవరేజీ పరిధిలోకి రావని ఐఆర్‌డీఏఐ తెలిపింది. బీమా కంపెనీలు ఈ ఉచిత సేవలను బీమా కవరేజీలో భాగంగా ప్రచారం చేసుకోవడం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. బీమా కంపెనీలు మోటారు గ్యారేజీలు, వర్క్‌షాపులతో కుదుర్చుకునే ఒప్పందాలు ప్రమాదాలకు లోనైన వాహనాల క్లెయిమ్‌ల పరిష్కారానికి అవసరమైన ఇన్సూరెన్స్‌ సేవల మాత్రమే అందించేందుకు మాత్రమే తోడ్పడతాయని పేర్కొంది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.