డీఎస్సీకి ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2021-04-16T04:42:39+05:30 IST

జిల్లా తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలగ (ఓసీ) కాపు, బలిజ, ఒంటరి నిరుద్యోగ యువతీ, యువకులకు 2021 డీఎస్సీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు ఆ సంఘం అధ్యక్షుడు వెంకటరామారావు ( పీవీఆర్‌) తెలిపారు.

డీఎస్సీకి ఉచిత శిక్షణ

విజయనగరం దాసన్నపేట, ఏప్రిల్‌ 15: జిల్లా తెలగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలగ (ఓసీ) కాపు, బలిజ, ఒంటరి నిరుద్యోగ యువతీ, యువకులకు 2021 డీఎస్సీ పరీక్షకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు  ఆ సంఘం అధ్యక్షుడు వెంకటరామారావు ( పీవీఆర్‌) తెలిపారు. గురువారం రింగురోడ్డు సమీపంలోని సంఘ కార్యాలయంలో  జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో డీఎస్సీకి శిక్షణ తీసుకునే ప్రతి అభ్యర్థి ఈ నెల 25లోగా రింగురోడ్డు సమీపంలోని సంఘ కార్యాలయంలో   పేరును నమోదు చేసుకోవాలన్నారు. సంఘం ఆధ్వర్యంలో ఉచిత వసతి సౌకర్యం కల్పిం చనున్నట్టు చెప్పారు.  ఇతర వివరాలకు  ఈ 94404 34529, 81213 73756 నెంబ ర్లను , పీవీఆర్‌ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.  సంఘ ప్రతినిధులు లక్ష్మీనారాయణమూర్తి, రమణారావు తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-04-16T04:42:39+05:30 IST