కిమ్స్‌లో ప్రాథమిక వైద్యంపై ఉచిత శిక్షణ, ఉద్యోగాల కల్పన

ABN , First Publish Date - 2021-10-27T05:16:11+05:30 IST

కిమ్స్‌ వైద్య శాలలో ప్రాథమిక వైద్యంపై ఉచిత నైపుణ్య శిక్ష ణ తరగతులతో పాటు ఉద్యోగావకాశాలు కల్పి స్తామని బొల్లినేని మెడి స్కిల్స్‌ సంస్థ ప్రతినిధి పీహెచ్‌.నాగేశ్వరరావు పేర్కొన్నారు.

కిమ్స్‌లో ప్రాథమిక  వైద్యంపై ఉచిత శిక్షణ, ఉద్యోగాల కల్పన



ఒంగోలు(రూరల్‌), అక్టోబరు26: కిమ్స్‌ వైద్య శాలలో ప్రాథమిక వైద్యంపై ఉచిత నైపుణ్య శిక్ష ణ తరగతులతో పాటు ఉద్యోగావకాశాలు కల్పి స్తామని బొల్లినేని మెడి స్కిల్స్‌ సంస్థ ప్రతినిధి  పీహెచ్‌.నాగేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవా రం ఒంగోలులోని కిమ్స్‌ వైద్యశాలలో నాగేశ్వరరా వు  మాట్లాడుతూ ప్రధానమంత్రి కౌశల్‌ వికాస యోజన ద్వారా ఈ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. 20రోజులపాటు ఉచిత శిక్షణతో పాటు భోజనం ఉంటుందని, అనంతరం 3 నెలలు వైద్యశాలలో రూ.3,750 వేతనం ఇస్తూ ఉద్యోగ శిక్షణ ఇస్తామ ని  తెలిపారు. 10తరగతి ఉత్తీర్ణులైన వారికి బేసి క్‌ కేర్‌ సపోర్టు, అడ్వాన్స్‌ సపోర్టు కేరా్‌ కోర్సుల కు, ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన వారికి శాంపిల్‌ కలెక్షన్‌ సపోర్టు, ఎమర్జెన్సీ సపోర్టు కేర్‌ కోర్సుల కు శిక్షణ ఉంటుందన్నారు. ఈ శిక్షణ పూర్తిచేసు కున్న వారు ప్రైవేటు వైద్యశాలలో ఉద్యోగాలు పొందవచ్చని తెలిపారు. అలాగే వివిధ రకాల పీజీ కోర్సులు, బీస్పీ పారామెడికల్‌ కోర్సులు, 14 రకాల పారామెడికల్‌ డిప్లమా కోర్సులు, నర్సింగ్‌, జీఎన్‌ఎం కోర్సులకు కిమ్స్‌ వైద్యకళాశాలలో ఆ సక్తి ఉన్న యువతీ, యువకులు ప్రవేశాలు పొం దవచ్చని సూచించారు. పూర్తి వివరాల కోసం 7680945357, 79950 13422 సెల్‌ నంబర్లలో ను, లేదా ముక్తినూతలపాడులోని  కిమ్స్‌ కాలేజ్‌ ఆఫ్‌ నర్సింగ్‌లో సమాచారం తెలుసుకోవచ్చని ఆ యన వెల్లడించారు. 


Updated Date - 2021-10-27T05:16:11+05:30 IST