ఆత్మానందమయి ఆధ్వర్యంలో యోగ, మెడిటేషన్

ABN , First Publish Date - 2022-08-09T02:51:39+05:30 IST

దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు ఆత్మానందమయి సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్ శిల్ప కళావేదికలో నిర్వహించారు. సుషుమ్న క్రియా యోగ సాధనకు

ఆత్మానందమయి ఆధ్వర్యంలో యోగ, మెడిటేషన్

దివ్య బాబాజీ సుషుమ్న క్రియా యోగ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక గురువు  ఆత్మానందమయి సుషుమ్న క్రియా యోగ దీక్షా కార్యక్రమాన్ని తాజాగా హైదరాబాద్  శిల్ప కళావేదికలో నిర్వహించారు. సుషుమ్న క్రియా యోగ సాధనకు సంబంధించిన అనేక సూక్ష్మాలను ఈ కార్యక్రమంలో ఆమె తెలియజేశారు. ఒత్తిడిని తట్టుకోగల శక్తి, నైపుణ్యం, మానసిక ప్రశాంతతను కలుగజేసే చాలా ప్రభావంతమైన ప్రక్రియ ఈ సాధన అని తెలిపారు.  సుషుమ్న క్రియా యోగ సాధన ద్వారా శారీరక, మానసిక, భావపూర్ణ, సామాజిక, ఆధ్యాత్మిక స్వస్థతను సాధించవచ్చన్నారు. సుషుమ్న క్రియా యోగ అంతర్ చైతన్యాన్ని, ఉత్సాహాన్ని, ప్రేరణను, అందించటంతో పాటు, ఆరోగ్యవంతమైన జీవనానికి నాంది పలుకుతుందని తెలిపారు. ఒత్తిడిని నివారించి, సామర్థ్యాన్ని, నేర్పును పెంపొందిస్తుందని.. ప్రతి ఒక్కరూ ఎంతో సులభంగా సాధన చేయగల మహత్తర ప్రక్రియ ఇదని ఆమె పేర్కొన్నారు. 


ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, IAS అధికారిణి శాంతా కుమారి , సినీనటుడు మరియు రాజకీయ నాయకులు మురళీ మోహన్, డిస్ట్రిక్ట్ కలెక్టర్  డి. ఆమే కుమార్, ప్రతీక్ జైన్, IAS అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌లతో పాటు దేశ విదేశాలనుంచి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. 





Updated Date - 2022-08-09T02:51:39+05:30 IST