రక్తం చిందించిన ‘ఏక్ మినీ కథ’... రియల్ స్టోరీ!

ABN , First Publish Date - 2021-09-05T11:49:11+05:30 IST

తెలుగులో ఇటీవల వచ్చిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని...

రక్తం చిందించిన ‘ఏక్ మినీ కథ’... రియల్ స్టోరీ!

ఉరల్: తెలుగులో ఇటీవల వచ్చిన ‘ఏక్ మినీ కథ’ చిత్రాన్ని చాలామంది చూసే ఉంటారు. దానిలో హీరో తన ప్రయివేట్ పార్ట్ తగినంతగా లేదని కలవరపడుతుంటాడు. అది పెరిగేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. చాలామంది పురుషులకు ఉండే అనుమానాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అయితే ఇప్పుడు ఇటువంటి ఘటనే రష్యాలో చోటుచేసుకుంది. 



పరిస్థితి రక్తం చిందించేవరకూ దారితీసింది. వివరాల్లోకి వెళితే మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు గొడవ పడ్డారు. ఈ నేపధ్యంలో ఒక స్నేహితుడు మరో స్నేహితుని విషయంలో ఏం చేశాడో తెలిస్తే కంగుతింటారు. రష్యాలోని ఉరల్ పరిధిలో గల బష్కోర్తోస్టన్‌లో 47 ఏళ్ల ఒక వ్యక్తి... 52 ఏళ్ల వయసు కలిగిన తన బాల్య స్నేహితునితో కలసి మద్యం సేవిస్తున్నాడు. మత్తులో మునిగిన వీరిద్దరూ తమ ప్రయివేట్ పార్ట్‌ల పొడుగు గురించి ఛాలెంజ్ చేసుకున్నారు.


దీనిలో ఒక స్నేహితుడు ఓడిపోయాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ వచ్చింది. ఒక స్నేహితుడు ఆగ్రహంతో ఊగిపోతూ, గొడ్డలితో స్నేహితుని ప్రయివేట్ పార్ట్ కట్ చేశాడు. దీనిని గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-09-05T11:49:11+05:30 IST