భార్య కారణంగా స్నేహితుడిని హతమార్చిన భర్త!

Published: Sun, 15 May 2022 16:39:24 ISTfb-iconwhatsapp-icontwitter-icon
భార్య కారణంగా స్నేహితుడిని హతమార్చిన భర్త!

ఇంటర్నెట్ డెస్క్: ఏదో పని మీద భర్త ఇంట్లోంచి బయటికెళ్లాడు. ఆ పని పూర్తవగానే తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్లో కనిపించిన దృశ్యం చూసి తొలుత షాకైన భర్త.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. స్నేహితుడిని అత్యంత క్రూరంగా హతమార్చాడు. అతడు అంతటి దారుణానికి పాల్పడటానికి కారణం అతడి భార్యే. కాగా.. స్థానికంగా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


మధ్యప్రదేశ్‌కు చెందిన తులారామ్ అనే వ్యక్తికి కొన్ని రోజల క్రితం వివాహం జరిగింది. భార్యతో కలిసి ఇండోర్‌లోని విజయ్ నగర్‌లో నివసిస్తున్న అతడు.. ఓ పని నిమిత్తం శుక్రవారం ఇంట్లోంచి బయటికెళ్లాడు. పని ముగించుకుని ఇంటికి తిరిగొచ్చే సరికి షాకింగ్ దృశ్యం అతడి కంట పడింది. తన భార్యతో స్నేహితుడు రామకృష్ణ.. అసభ్యకర రీతిలో కనిపించడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే సుత్తితో అతడి తలపై దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా.. ఇంట్లోంచి అరుపులు రావడంతో.. చుట్టుపక్కల వాళ్లు ఘటనా స్థలానికి పరుగెత్తుకెళ్లారు. అక్కడ రామకృష్ణ మృతదేహాం చూసి పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు వచ్చే సరికి అక్కడి నుంచి తులారామ్ తప్పించుకున్నాడు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. తులారామ్‌ను వెతికి పట్టుకున్నారు. విచారణ సందర్భంగా తులారామ్ నేరాన్ని అంగీకరించాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందువల్లే రామకృష్ణను హత్య చేసినట్టు స్పష్టం చేశాడు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.