పది సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిన మిత్రుడు.. మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే..

ABN , First Publish Date - 2022-04-20T18:17:40+05:30 IST

ఆమెకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. సుఖంగా సాగిపోతున్న జీవితం..

పది సంవత్సరాల తర్వాత ఫోన్ చేసిన మిత్రుడు.. మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే..

ఆమెకు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది.. పదేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.. సుఖంగా సాగిపోతున్న జీవితం.. ఇంతలో ఆమె కాలేజీ ఫ్రెండ్ మళ్లీ కలిశాడు.. ఫోన్ ద్వారా మాటలు కలిపాడు.. ఈమె ఫోన్ ద్వారా కొన్ని ఫొటోలు సేకరించాడు.. వాటిని మార్ఫింగ్ చేసి న్యూడ్‌గా మార్చాడు.. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని లేదా రూ.15 లక్షలు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ ప్రారంభించాడు.. ఆమె తన భర్తతో కలిసి పోలీసులను ఆశ్రయించినా లాభం కనిపించలేదు. దీంతో ఆమె ఎస్పీకి ఓ లేఖ రాసింది. 


మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన మహిళకు వివాహానికి ముందే సంజయ్ రజాక్ అనే వ్యక్తితో స్నేహముంది. ఇద్దరూ ఒకే కాలనీలో నివసించేవాళ్లు. తర్వాత ఆమె 2004లో వివాహం చేసుకుని అత్తింటికి వెళ్లిపోయింది. భర్త, కొడుకుతో సుఖంగా జీవిస్తోంది. 2019లో ఆమెకు సోషల్ మీడియా ద్వారా సంజయ్ టచ్‌లోకి వెళ్లాడు. పాత స్నేహితుడు కదా అని ఆమె మాట్లాడింది. ఆ తర్వాత ఇద్దరూ రోజూ మాట్లాడుకునే వారు. ఈ క్రమంలో సంజయ్‌కు ఆమె తన ఫొటోలు కొన్నింటిని పంపింది. వాటిని సంజయ్ మార్ఫింగ్ చేశాడు. న్యూడ్ ఫొటోలుగా మార్చాడు. 


ఆ ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్ ప్రారంభించాడు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో రూ.15 లక్షలు ఇవ్వాలని, లేకపోతే ఆ ఫొటోలను వైరల్ చేస్తానని బ్లాక్‌మెయిల్ ప్రారంభించాడు. ఇద్దరికీ తెలిసిన కొందరు వ్యక్తులకు ఆ ఫొటోలను పంపించాడు. దీంతో ఆ మహిళ తన భర్తకు మొత్తం విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు. మరోవైపు సంజయ్ వేధింపులు ఎక్కువవుతున్నాయి. దీంతో ఆ మహిళ జిల్లా ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2022-04-20T18:17:40+05:30 IST