పరిచయం పేరుతో లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-04-17T06:02:08+05:30 IST

ముగ్గురు పిల్లల తల్లికి ఆటో డ్రైవర్‌ పరిచమయ్యాడు. ఆమెకు భర్త లేడని తెలుసుకున్న ఆటోడ్రైవర్‌ పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్న ఇరువురు స్నేహం పెరగ డంతో ఆమె ఇంటిలో జరిగే శుభకర్యాలకు కూడా వెళ్లడం ప్రారంభించాడు. వారు తీసు కున్న ఫొటోలను అడ్డుపెట్టి మహిళను బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించి మానసికం గా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమెకు మరో వివాహం కుదిరిన విషయం తెలుసుకు ని దాడి చేసి చంపేస్తామని కూడా బెదిరిం చాడు.

పరిచయం పేరుతో లైంగిక వేధింపులు

ఆటోడ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు


ఒంగోలు(క్రైం), ఏప్రిల్‌ 16: ముగ్గురు పిల్లల తల్లికి ఆటో డ్రైవర్‌ పరిచమయ్యాడు. ఆమెకు భర్త లేడని తెలుసుకున్న ఆటోడ్రైవర్‌ పరిచయం పెంచుకున్నాడు. రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్న ఇరువురు స్నేహం పెరగ డంతో ఆమె ఇంటిలో జరిగే శుభకర్యాలకు కూడా వెళ్లడం ప్రారంభించాడు. వారు తీసు కున్న ఫొటోలను అడ్డుపెట్టి మహిళను బ్లాక్‌ మెయిల్‌ చేయడం ప్రారంభించి మానసికం గా వేధింపులకు గురి చేస్తున్నాడు. ఆమెకు మరో వివాహం కుదిరిన విషయం తెలుసుకు ని దాడి చేసి చంపేస్తామని కూడా బెదిరిం చాడు. వివరాలలోకెళితే.. కొండపి మండలాని కి చెందిన మహిళకు ముగ్గురు సంతానం కలిగిన తరువాత భర్త వదిలేసి వెళ్లాడు. దీం తో ఐదు సంవత్సరాల క్రితం ఒంగోలు చేరు కుని దారావారితోటలో నివాసం ఉంటూ పె ట్రోల్‌బంకులో పని చేస్తూ జీవనం గడుపు తోంది. ఈక్రమంలో రామ్‌నగర్‌ ఒకటో లైన్‌ లో నివాసం ఉండే షేక్‌ సిద్దిఖ్‌ అలియాస్‌ బ బ్లూ డీజిల్‌ కొట్టేంచుకునేందుకు పెట్రోలు బంకుకు వెళ్లి ఆమెతో పరిచయమయ్యాడు. అప్పటి నుంచి వారిరువురు స్నేహితులుగా ఉన్నారు. అయితే ఆమె మరో వ్యక్తితో వివా హం చేసుకునేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటోడ్రైవర్‌ ఆమెను బలవంతంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నం చేశాడు. అ ంగీకరించకపోవడంతో దాడి చేసి కులం పే రుతో దూషించాడు. ఈ మేరకు  దిశ పోలీ సులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. శుక్ర వారం డీఎస్పీ ధనుంజయ సంఘటనా స్థలా న్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-04-17T06:02:08+05:30 IST