Friendship Day 2022: ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం నాడే ఫ్రెండ్‌షిప్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

ABN , First Publish Date - 2022-08-07T15:50:13+05:30 IST

మాటల్లో చెప్పలేనిది స్నేహబంధం. ఈ బంధాన్ని గుర్తు చేసుకుంటూ...

Friendship Day 2022: ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారం నాడే ఫ్రెండ్‌షిప్ డే ఎందుకు జరుపుకుంటారో తెలుసా?

మాటల్లో చెప్పలేనిది స్నేహబంధం. ఈ బంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఫ్రెండ్‌షిప్ డేను జరుపుకుంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం(Friendshipday in India) నాడు జరుపుకుంటారు. ఈ రోజున స్నేహితులంతా కలసి ఆనందంగా వేడుక చేసుకుంటారు. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు నెల మొదటి ఆదివారం నాడే ఫ్రెండ్‌షిప్ డే((Friendshipday) ఎందుకు జరుపుకుంటారనే ప్రశ్న మన మదిలో మెదులుతుంది. దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. 


స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకోవడమనేది పరాగ్వే దేశంలో ప్రారంభమైనది. అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ప్రతిపాదన మొదటిసారిగా 1958లో ప్రవేశపెట్టారు. ఈ నేపధ్యంలో ఐక్యరాజ్యసమితి జూలై 30న అంతర్జాతీయ స్నేహ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. భారతదేశం(India), బంగ్లాదేశ్(Bangladesh), అమెరికా(America) తదితర దేశాలలో ఆగస్టు మొదటి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆగస్ట్ మొదటి ఆదివారం నాడు ఫ్రెండ్‌షిప్ డే(Friendshipday) చేసుకోవడం వెనుక ఒక కథ ఉంది. అమెరికాలో 1935లో ఆగస్టు మొదటి ఆదివారం నాడు ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడట. ఈ విషయాన్ని తెలుసుకున్న అతని ప్రాణస్నేహితుడు ఆవేదనకులోనై ఆత్మహత్య చేసుకున్నాడట. ఈ స్నేహితుల మధ్య ఉన్న అనుబంధాన్ని చూసిన యూఎస్ ప్రభుత్వం ఆగస్టు మొదటి ఆదివారం(First Sunday in August) నాడు ఫ్రెండ్‌షిప్ డేని జరుపుకోవాలని నిర్ణయించింది. అప్పటి నుంచి అదే అమలవుతోంది. దీని తరువాత భారతదేశంతో సహా ఇతర దేశాలలో ఆగస్టు మొదటి ఆదివారం నాడు స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.

Updated Date - 2022-08-07T15:50:13+05:30 IST