దివికేగిన మిత్రుల్ని స్మరిస్తూ ఫ్లాష్‌ ఫ్రెండ్‌షిప్‌ డే

ABN , First Publish Date - 2022-08-08T03:37:21+05:30 IST

దివికేగిన మిత్రులను స్మరించుకుంటూ ఏలూరు ఫ్లాష్‌ టీం ఆధఽ్వర్యంలో ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే నిర్వహించారు.

దివికేగిన మిత్రుల్ని స్మరిస్తూ ఫ్లాష్‌ ఫ్రెండ్‌షిప్‌ డే
మృతి చెందిన తల్లిదండ్రుల చిత్ర పటాల వద్ద ఫ్లాష్‌ టీం సభ్యులు

ఏలూరు ఎడ్యుకేషన్‌, ఆగస్టు 7: దివికేగిన మిత్రులను స్మరించుకుంటూ ఏలూరు ఫ్లాష్‌ టీం ఆధఽ్వర్యంలో ఆదివారం ఫ్రెండ్‌షిప్‌ డే నిర్వహించారు. ‘ప్రత్యక్షదైవాల ప్రస్థానం’ పేరిట వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది లోకాన్ని వీడిన ఆత్మీయుల స్మరణంతో ‘వనమాలి–జ్ఞాపకం పదిలం’ కార్యక్రమానికి కొనసాగింపుగా గతేడాది నాటిన 125 మొక్కలకు ఫ్లాష్‌ వలం టీర్లతో పూలదండలు వేయించి మృతుల చిత్రపటాలవద్ద వారి కుటుంబ సభ్యులతో నివాళులర్పించారు. సంస్థ ఆశయాలను  ఫ్లాష్‌ ప్రతినిధి వై.శ్రీనివా సరావు వివరిస్తూ 19 సంవత్సరాల క్రితం ప్రారంభించిన సేవా కార్యక్రమా లను ఇప్పటికీ వివిధ రూపాల్లో కొనసాగిస్తున్నామన్నారు. ప్రస్తుత రోజుల్లో జన్మనిచ్చిన తల్లితండ్రులను కూడా స్మరించుకోలేని బిజీలైఫ్‌కు అలవాటుపడ టం శోచనీయమన్నారు. పూర్వకాలంలో తల్లిదండ్రులపేర్లను పిల్లలకు పెట్టడం ద్వారా వారిని జ్ఞాపకం చేసుకునేవారని, దీనికిభిన్నంగా ఇప్పుడు సంస్కృతి మారిపోయిందన్నారు. మరుగుపడిన మధురమైన తల్లిదండ్రుల త్యాగాలకు కాలదోషంలేదని నిరూపించేప్రయత్నంలో భాగంగా ఏటా స్నేహి తుల దినోత్సవం రోజున అమ్మానాన్నలను స్మరించుకునే సంస్కృతిని కొనసా గిస్తున్నామన్నారు. మృతిచెందిన తల్లిదండ్రులపేరిట మొక్కలు నాటడం, పక్కా ట్రీ గార్డ్స్‌ సంరక్షణతో వాటికి వేసవిలో నీటి సదుపాయం కల్పించి పెంచుతూ, వారి జ్ఞాపకాలను వృక్ష సంపదగా మార్చి భావితరాలకు జ్ఞాపకా ల సంస్కృతిని కొనసాగిస్తున్నామన్నారు. తొలిస్నేహితులు తుదివరకు అమ్మా నాన్నలేనన్నారు. వృద్ధులకు చేతి కర్రలను పంపిణీ చేశారు.


Updated Date - 2022-08-08T03:37:21+05:30 IST