జిల్లా వ్యాప్తంగా స్తంభించిన జనజీవనం

ABN , First Publish Date - 2021-07-24T04:39:27+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా కురిసినవర్షానికి జనజీవనం స్తం భించిపోయింది.

జిల్లా వ్యాప్తంగా స్తంభించిన జనజీవనం
దహెగాంలో పెసరికుంట సమీపంలో కోతకు గురైన రోడ్డు

- కోతకు గురైన రోడ్లు.. 

- నీట మునిగిన పంటలు  

- నిలిచిపోయిన రాకపోకలు 

- ఉధృతంగా ప్రాణహిత, పెన్‌గంగా నదులు

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 23: జిల్లా వ్యాప్తంగా మూడురోజులుగా కురిసినవర్షానికి జనజీవనం స్తం భించిపోయింది. రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. పట్టణంలో కాలనీలు జలమయమయ్యాయి. పలు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పంటలన్నీ దెబ్బతి న్నా యి. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. మండలంలోని బూర్గుడ ఎస్సీ కాలనీలో నీట మునిగిన ప్రాంతాలను శుక్రవారం ఎంపీపీ అరిగెలమల్లిఖార్జున్‌ సందర్శిం చారు. ఈసందర్భంగా మాట్లాడుతూ డ్రెయినేజీ వ్య వస్థ సక్రమంగా లేదని వాటినిర్మాణానికి కృషిచేస్తాన న్నారు. అప్పపల్లి రహదారిలో ప్రవహించే వాగును, దెబ్బతిన్న పత్తిపంటను పరిశీలించారు.

సిర్పూర్‌(టి): భారీ వర్షాలకు మండలకేంద్రం లోని లింగయ్యకు చెందిన ఇల్లు కూలిపోయింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీవర్షాలకు మండల సరిహద్దున పెన్‌గంగా ఉధృతంగా ప్రవహి స్తోంది. వెంకట్రావుపేట గ్రామంలో పెన్‌గంగా బ్యాక్‌ వాటర్‌తో పంట చేలు నీటమునిగాయి. హుడ్కిలి, మాకిడి, జక్కాపూర్‌ వంతెనపైనుంచి వరదనీరు ప్రవ హిస్తోంది. చీలపల్లిగ్రామంలో పలువురి ఇళ్లలో వరద నీరు చేరడంతో సర్పంచ్‌ యాదగిరిబ్రహ్మయ్య పాఠ శాలభవనంలో పునరావాసం కల్పించారు. చింతకుం టల, చుచ్చుపల్లి, భూపాలపట్నం, కేశవపట్నం, హీరాపూర్‌ తదితర రోడ్లపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఆయాప్రాంతాలను తహసీల్దార్‌ నదీముల్లాఖాన్‌, ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏఈవో కవిత, ఎస్టీవోటీ కృష్ణమూర్తి, ఎస్సైరవికుమార్‌ ఎప్పటికప్పుడు  సమీక్షిస్తున్నారు. 

బెజ్జూరు: మండలంలో శుక్రవారం మోస్తరుగా వర్షం కురిసింది. తీగలఒర్రె ఉప్పొంగడంతో రాకపో కలు నిలిచిపోయాయి. ఎస్సైసాగర్‌ ఒర్రెను పరిశీ లించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. రాక పోకలు చేయరాదన్నారు.  

చింతలమానేపల్లి:  మండలంలోని దిందావాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో గ్రామస్థులు బయ టకు రాలేని పరిస్థితి నెలకొంది. అలాగే గూడెం ప్రాణహితనది నిండుకుండలా ప్రవహిస్తోంది. దీంతో కౌటాల సీఐబుద్ధేస్వామి, ఎస్సై సందీప్‌కుమార్‌ వాగు లను పరిశీలించి ప్రజలకు తగుసూచనలు ఇచ్చారు. విద్యుత్‌ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

దహెగాం: పెద్దవాగు వరద ఉధృతికి మండలం లోని పలుగ్రామాల్లోకి వరదనీరు వచ్చిచేరింది. వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బీటీ రోడ్లు కోతకు గురయ్యాయి. పెద్దవాగు ఎగువన ఉన్న కుమరం భీం ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టులు గేట్లు ఎత్తడంతో పంట చేల్లోకి వరదనీరు చేరింది. పెద్దవాగు పరివాహక ప్రాంతాలైన ఇట్యాల, రాళ్ల గూడ, బోర్లకుంట, కోత్మీర్‌, బీబ్రా, పెసరికుంట, ఐనం, దహెగాం, మర్రిపల్లి, పంబాపూర్‌, లగ్గాం, ఒడ్డు గూడ, చిన్నరాస్పెల్లి, గిరివెల్లి తదితర గ్రామా ల్లోని పంటలు నీటమునిగాయి. పెద్దవాగు వరద ఉధృతికి బీబ్రా గ్రామంలోని శివాలయం నీటము నిగింది. రోడ్డు తెగిపోయింది. ఐనంగ్రామం వరద నీటిలో చిక్కుకుంది. బీబ్రా,పెసరికుంట సమీపం లోని బీటీరోడ్డు పలుచోట్ల కోతకుగురైంది. ఒడ్డు గూడ, దహెగాం, ఇట్యాల, రాళ్ల గూడెం, బోర ్లకుంట సమీపంలోని బీటి రహదారు లపై నుంచి వరదనీరు వెళ్లడంతో కాగజ్‌నగర్‌- దహెగాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బ్రాహ్మణ్‌ చిచ్చాలలో చంద్రకళ ఇల్లు కూలిపోయింది. దహెగాం మండలానికి విద్యుత్‌సరఫరా నిలిచి పోవడంతో అంధకారం నెలకొంది. కొంచవెల్లి సమీపంలో పాల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువ తెగిపోవడంతో సర్పంచ్‌ భాగ్యలక్ష్మి ఎక్స్‌కవేటర్‌తో కాలువను పూడ్చివేయించారు. వర్షాల కారణంగా విద్యుత్‌సరఫరా నిలిచిపోవడంతో బ్యాంకు సేవలునిలిపేసినట్లు మేనేజర్‌ తెలిపారు. 

కౌటాల: మండలంలో వర్షాల వల్ల రెండు రోజు లుగా విద్యుత్‌సరఫరా లేక పోవడంతో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుడ్లబోరి- వైగాం గ్రామాల మధ్య వరదనీరు చేరడంతో రాక పోకలకు ఇబ్బంది ఏర్ప డింది. మండల సరిహద్దున ప్రాణహిత, పెన్‌గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

కాగజ్‌నగర్‌ రూరల్‌: మండలంలోని పెద్దవాగు పరివాహక ప్రాంతాల్లోని పంటపొలాలు నీటము నిగాయి. మండలంలోని సార్సాల గ్రామం వద్ద ఉచ్చమల్లి ప్రాజెక్టు వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో పెంచికలపేట-కాగజ్‌నగర్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పెద్దవాగు ఉప్పొంగడంతో భట్టు పల్లి, దహెగాం మండలాల్లోని వైకుంఠధామాలు నీటమునిగాయి.

పెంచికలపేట: మండలంలోని దరోగపల్లి, చెడ్వాయి, బొంబాయిగూడ, గుంట్లపేట, పోతెపల్లి, పెంచికలపేట, ఎల్లూరు, ఎల్కపల్లి, ఆగర్‌గూడ, కమ్మ ర్‌గాం, లోడ్‌పల్లి, మురళీగూడ, జిల్లెడ తదితర గ్రామాల్లో వేలఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. ఎర్ర గుంట, ఆగర్‌గూడ, కమ్మర్‌గాం, మురళీగూడ, జిల్లెడ, నందిగాం గ్రామాల్లో జలదిగ్భందంలో ఉన్నాయి. ఎస్సైలు రమేష్‌, రామన్‌కుమార్‌ వరద ఉధృతి తీవ్రంగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాల న్నారు.

కెరమెరి: మండలంలోని పలు ఇళ్లు కూలిపోయా యి. సుర్దాపూర్‌ గ్రామానికి చెందిన హేక్‌మహేత, ధనోరగ్రామంలో చహకటి రాజుపటేల్‌ ఇళ్లు కూలిపో యాయి. గ్రామాల్లోని పత్తి చేనులు నీట మునిగాయి. కుమరంభీం ప్రాజెక్టు సమీప గ్రామాలైన నిశాని, ఇందాపూర్‌, దేవుడుపల్లి గ్రామాల్లోకి వరద నీరు రావడంతో జలమయం అయ్యాయి. సాకడ, సాంగ్వీ, గోయగాం గ్రామాల్లో నీటమునిగిన పంటలను ఏడీఏ వెంకట్‌, ఎంపీపీ మోతీరాం, జడ్పీటీసీ దృపతాబాయి పరిశీలించారు. ఈ సందర్భంగా వాగు మాట్లాడుతూ పంటనష్టం అంచనావేసి ఉన్నతాధికారులకు నివేది కలు పంపిస్తామన్నారు. 

లింగాపూర్‌: మండలంలోని కీమానాయక్‌తండా బ్రిడ్జి కొట్టుకుపోయింది. శుక్రవారం ఎంపీడీవో ప్రసాద్‌, తహసీల్దార్‌ రమేష్‌ పరిశీలించారు. మండలంలోని మిట్టేజలపాతంకు సందర్శకులు రాకుండా ఉండేందుకు ఎస్సై మధుకర్‌ పిట్టగూడ, లింగా పూర్‌, మనకుగూడ వద్ద చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశారు. అలాగే మండలంలో వరదకు నష్ట పోయిన పంటలను ఏడీఏ వెంకట్‌ పరిశీలించారు.

వాంకిడి: మండలంలో వరద ఉధృతికి వాంకిడి, పాటగూడ, లంజన్‌వీర, దాబా గ్రామాల వంతెనలు దెబ్బతిని ప్రమాదకంగా మారాయి. అనేక గ్రామాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. పత్తిపంట నీట ముని గింది. మండల కేంద్రంలో విద్యుత్‌ స్తంభాలు పడిపో వడంతో విద్యుత్‌సరఫరా నిలిచి పోయింది. సిగ్నల్స్‌ లేని కారణంగా సెల్‌ఫోన్‌లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని కనర్‌గాం, కోమటిగూడ గ్రామాల మధ్య ఒర్రె ఉప్పొం గి ప్రవహించడంతో కనర్‌గాం గ్రామానికి వెళ్లాల్సిన కొంత మంది విద్యార్థులు, స్థానికులు మధ్యలో ఆగి పోయారు. విషయం తెలుసుకున్న అడిషనల్‌ ఎస్పీ అచ్చేశ్వర్‌రావు, ఎస్సై సుధాకర్‌ వరద ఉధృతి తగ్గిన తరువాత రాత్రివారిని ఇళ్లకు సురక్షితంగా పంపిం చారు. 

జైనూరు: మండలంలోని అడ్డెసర గ్రామ పంచా యతీ పరిధిలో గల ఒడ్డెరగూడలో కాథ్లె బుజ్జమ్మకు చెందిన ఇల్లు కూలిపోయింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఇతర గదిలో నిద్రిస్తుండడంతో ప్రమాదం తప్పింది. బాధిత కుటుంబాన్ని వీఆర్వో బాపు,సర్పంచ్‌ రామ్‌షావ్‌ పరామర్శించారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వర్షం నీరు చేరింది. కాగజ్‌నగర్‌ సమీపంలో ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పరివాహక ప్రాంతాల వారు ఎవరూవాగు సమీపంలోకి పోరాదని ఆర్డీవో చిత్రు ఆదేశాలు జారీ చేశారు. అలాగే రెవెన్యూ సిబ్బం దిని కూడా అప్రమత్తం చేశారు.

సిర్పూర్‌(యూ): మండలంలో వర్షాలతో దెబ్బ తిన్న పంట పొలాలను శుక్రవారం వ్యవసాయశాఖ ఏడిఏ వెంకటి పరిశీలించారు. ఆయన వెంట ఏవో రామకృష్ణ, అంజలి, నరేష్‌, రైతులు ఆత్రం రాజేశ్వర్‌ ఉన్నారు.

పెద్దవాగులో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితం

పెంచికలపేట: మండలంలోని పెద్దవాగు, ఉచ్చమల్లవాగు ఉధృతంగా ప్రవహిస్తు న్నాయి. పెద్దవాగు వరద ఉధృతిలో వంతెన నిర్మాణ వలస కార్మికులు  తొమ్మిది చిక్కుకున్నారు. శుక్రవారం ఉదయం 3.30 గంటల ప్రాంతంలో స్థానిక పోలీసులకు సమాచారం అందగా హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఎస్సై రమేష్‌, రామన్‌ కుమార్‌ సిబ్బంది, స్థానికుల సహయంతో తాళ్లు, రబ్బర్‌ట్యూబ్‌లతో వారిని సురక్షి తంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు కృష్ణారావు పరిస్థితిని అడిగి తెలుసుకుని కార్మికులకు అల్పాహారం అందజేశారు. వారిని ఎల్లూరు ఆశ్రమ పాఠశాలకు తరలించారు.

Updated Date - 2021-07-24T04:39:27+05:30 IST