స్వాతంత్య్ర ఫలం.. అందరికీ సమన్యాయం

ABN , First Publish Date - 2022-08-08T06:23:31+05:30 IST

ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలతో దేశానికి లభించిన స్వాతంత్య్ర ఫలంతో ప్రజలందరికీ సమన్యాయమే లక్ష్యంగా న్యాయవ్యవస్థ కృషిచేస్తోందని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌ పేర్కొన్నారు.

స్వాతంత్య్ర ఫలం.. అందరికీ సమన్యాయం
గిరిజనుల స్థితిగతులను న్యాయమూర్తికి వివరిస్తున్న ధనశేఖర్‌

జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణ కుమార్‌

బంగారుపాళ్యం, ఆగస్టు 7: ఎందరో మహానుభావుల ప్రాణత్యాగాలతో దేశానికి లభించిన స్వాతంత్య్ర ఫలంతో ప్రజలందరికీ సమన్యాయమే లక్ష్యంగా న్యాయవ్యవస్థ కృషిచేస్తోందని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కరుణకుమార్‌ పేర్కొన్నారు. బంగారుపాళ్యం మండలంలోని గిరిజన నివాస ప్రాంతాలైన జయంతి ఎస్టీకాలనీ, ఎగువ బందార్లపల్లె గ్రామాల్లో ఆదివారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చిల్డ్రన్‌ బిలీవ్‌, రోప్స్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించిన గిరిజనులకు చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. బాల్యవివాహాలు, అనర్థాలు, భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన చట్టాలు, హక్కులు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలను అర్హులైన గిరిజనులకు అందజేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జిల్లా గిరిజన సంక్షేమాధికారి మూర్తి పేర్కొన్నారు. అనంతరం చిల్డ్రన్‌ బిలీవ్‌, రోప్స్‌ సంస్థ దత్తత తీసుకున్న గ్రామాల్లో గిరిజనుల స్థితిగతులపై సంస్థ అధ్యక్షుడు ధనశేఖర్‌ న్యాయమూర్తికి వివరించారు. గిరిజనులతో కలిసి నిర్వహించిన స్వాతంత్య్ర ముందస్తు వేడుకల్లో న్యాయమూర్తి, అధికారులు పాల్గొన్నారు. అంగన్‌వాడీ కేంద్రం, నివాసగృహాలు, వ్యవసాయ భూములు, పంపుసెట్ల మంజూరుకు పలువురు గిరిజనులు వినతి పత్రాలు అందించారు. తహసీల్దార్‌ బెన్నురాజ్‌, ఎంపీడీవో గౌస్‌ బాషా, ఎస్‌ఐ మల్లికార్జున్‌ రెడ్డి, ఏఎ్‌సఐ నరసింహులు, ఎఫ్‌ఎ్‌సవో ధనంజయ, వీఆర్వో రాజ్‌కుమార్‌, రాష్ట్ర కురుబ కార్పొరేషన్‌ డైరక్టర్‌ అమర్‌నాథ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T06:23:31+05:30 IST