ఊరిస్తున్న ఉల్లి

ABN , First Publish Date - 2021-02-26T04:11:21+05:30 IST

ఉల్లి ధరలు మండిపోతున్నాయి.

ఊరిస్తున్న ఉల్లి
ఉల్లి చేనులో కలుపు తీస్తున్న మహిళా కూలీలు

- ఇతర దేశాలకు ఎగుమతితో పెరిగిన డిమాండ్‌

- హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.3,500 నుంచి రూ.4,500 పలుకుతున్న ధర

- జోగుళాంబ గద్వాల జిల్లాలో 4,685 ఎకరాల్లో పంట సాగు

- మార్చి నుంచి చేతికి రానున్న దిగుబడులు

- పెరుగుతున్న ధరలతో రైతుల్లో చిగురిస్తున్న ఆశలు


గద్వాల, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఉల్లి ధరలు మండిపోతున్నాయి. విదేశాలకు ఉల్లి ఎగుమతులు చే యడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులివ్వడంతో స్థా నికంగా ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. వారం రోజుల కిందట రూ.30లోపు ఉన్న కేజీ ఉల్లి ధర, రెండు రోజుల నుంచి రూ.50 నుంచి రూ.60కి ఎగబాకాయి.

జోగుళాంబ గద్వాల జిల్లాల్లో రైతులు ఎక్కువగా ఉల్లి పంటను సాగు చేస్తారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ లో జోగుళాంబ గద్వాల జిల్లాలో దాదాపు 3,685 ఎకరా ల్లో పంటను సాగు చేశారు. అయితే, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులలో కురిసిన భారీ వర్షాలకు మెజార్టీ పంటలు దెబ్బతిన్నాయి. ఉన్న పంటను తీయగా, కొద్ది పాటిగా ది గుబడులు చేతికి వచ్చాయి. ఈ సమయంలో వాటికి డి మాండ్‌ బాగా పెరిగింది. దాదాపు కిలో ఉల్లి రూ.వంద వరకు పలికింది. దీంతో యాసంగిలోనూ జిల్లాలోని వడ్డే పల్లి, మానవపాడు, ఉండవల్లి, ఇటిక్యాల ధరూర్‌, గద్వా ల, కేటీదొడ్డి మండలాల్లో దాదాపు 4,685 ఎకరాల్లో రైతు లు ఉల్లి పంటలను సాగు చేశారు. డిసెంబరులో నారు పోయగా, మార్చి నుంచి మే వరకు దిగుబడులు చేతికి రానున్నాయి. ఎకరానికి వంద క్వింటాళ్ల చొప్పున మొత్తం 4,68,400 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది.


నాడు రూ.500.. నేడు రూ.3,500

గతేడాది యాసంగిలో ఉల్లి రైతులకు ధరలు రాలేదు. దీంతో పంటను నేలలోనే వదిలేశారు. హోల్‌సేల్‌ మార్కె ట్లో క్వింటాల్‌ ఉల్లిగడ్డలు రూ.350 నుంచి రూ.500 ధర లు పలికాయి. ఒకసారి మాత్రం రూ.650 నుంచి రూ.750 పలికా యి. ఈ ధరలు మూడు రోజులు మాత్రమే కొనసాగాయి. కానీ, ఈ ఏడాది ఉల్లి ధరలు హైరదాబాద్‌, కర్నూల్‌ మార్కెట్‌లో రూ.3,500 నుంచి రూ.4,500 పలుకున్నాయి. దుబాద్‌ దేశానికి ఉల్లిని ఎగుమతి చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ధరలు అమాంతం పె రిగాయి. ప్రస్తుతం జిల్లాలో ఉల్లి దిగుబడులు రావడానికి మరో నె ల రోజులు సమయం పట్టే అవకా శం ఉంది. ఈ దిగుబడులు వచ్చే నాటికి ఉల్లి ధరలు ఇలాగే కొనసా గితే రైతులకు మేలు జరిగే అవకా శం ఉంది. కానీ, వ్యాపారులు మ ళ్లీ ధరలను దింపితే మాత్రం రై తులు నష్టాలను ఎదుర్కోవాలి.

Updated Date - 2021-02-26T04:11:21+05:30 IST