ఇంధన ధరల స్తంభన... కంపెనీలకు రూ. 19 వేల కోట్ల నష్టం...

Published: Thu, 24 Mar 2022 19:12:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ఇంధన ధరల స్తంభన...  కంపెనీలకు రూ. 19 వేల కోట్ల నష్టం...

న్యూఢిల్లీ/ముంబై : ఇంధన ధరల స్తంభన నేపథ్యంలో... ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ సంస్థలు రూ. 19 వేల కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయాయి. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు సగటున 111 డాలర్లుగా కొనసాగితే, ఇంధన ధరలను(ఏఎఫ్‌పీ) పెంచినపక్షంలో... ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ రోజువారీ నష్టం $ 65-70 మిలియన్లకు పెరగవచ్చని అంచనాలున్నాయి. ముడిచమురు ధరలు బ్యారెల్‌కు సగటున 111 డాలర్లుగా కొనసాగినపక్షంలో... ఇంధన ధరలను(ఏఎఫ్‌పీ) పెంచితే... ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ సంస్థల రోజువారీ నష్టం $ 65-70 మిలియన్లకు పెరగవచ్చని అంచనా. చమురు మార్కెటింగ్ కంపెనీలు 2022 లో మొదటిసారిగా మార్చి 22, మార్చి 23 తేదీల్లో లీటరుకు 80 పైసల చొప్పున ధరలను పెంచాయి. కాగా... ఈ రోజు(గురువారం) మాత్రం పెంపుదల చోటుచేసుకోలేదు.  క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగినప్పటికీ... ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌‌పీసీఎల్ సహా భారత్ అగ్రశ్రేణి ఇంధన రిటైలర్లు ధరలను యథాతథంగానే కొనసాగించారు. కాగా... మార్చిలో $ 2.25 బిలియన్లు, లేదా... రూ. 19 వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయని మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ తన తాజా నివేదికలో వెల్లడించింది. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.