పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు ఇండియాలోనే తక్కువ: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-04-05T22:03:15+05:30 IST

అంతర్జాతీయంగా గ్యాస్, పెట్రోల్‌ల ధరలు పెరిగాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఈ పెరుగుదల కేవలం పదవ వంతు మాత్రమే. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ ధరల పెంపు చూసుకుంటే.. అమెరికాలో 51 శాతం పెరిగాయి. అలాగే జర్మనీలో 55 శాతం, బ్రిటన్‌లో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం..

పెట్రోల్, గ్యాస్ ధరల పెంపు ఇండియాలోనే తక్కువ: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: మిగతా దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలు తక్కువగా పెరిగాయని పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మంగళవారం ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ ఇతర దేశాల్లో ధరలు పెరిగిన శాతాన్ని, భారత్‌లో పెరిగిన శాతాన్ని వివరించారు. ‘‘అంతర్జాతీయంగా గ్యాస్, పెట్రోల్‌ల ధరలు పెరిగాయి. అయితే మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో ఈ పెరుగుదల కేవలం పదవ వంతు మాత్రమే. ఏప్రిల్ 2021 నుంచి మార్చి 2022 వరకు అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ ధరల పెంపు చూసుకుంటే.. అమెరికాలో 51 శాతం పెరిగాయి. అలాగే జర్మనీలో 55 శాతం, బ్రిటన్‌లో 55 శాతం, ఫ్రాన్స్‌లో 50 శాతం, స్పెయిన్ 58 శాతం మేరకు పెరిగింది. కానీ ఇండియాలో కేవలం 5 శాతం మాత్రమే పెరిగింది’’ అని అన్నారు.

Updated Date - 2022-04-05T22:03:15+05:30 IST