ఫఫ్డా

ABN , First Publish Date - 2020-10-24T15:56:21+05:30 IST

సెనగపిండి - ఒక కప్పు, వాము - పావు టీస్పూన్‌, నల్లమిరియాలు - 10, పసుపు - పావు టీస్పూన్‌,

ఫఫ్డా

గుజరాతీలు దసరా పండగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకొంటారు. అమ్మవారికి ఫఫ్డా అనే ప్రత్యేకమైన వంటకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. 


కావలసినవి: సెనగపిండి - ఒక కప్పు, వాము - పావు టీస్పూన్‌, నల్లమిరియాలు - 10, పసుపు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, బేకింగ్‌ సోడా - కొద్దిగా, నూనె - సరిపడా, ఉప్పు - రుచికి తగినంత. 


తయారీ విధానం: ఒక పాత్రలో సెనగపిండి తీసుకుని అందులో వాము, దంచిన మిరియాలు, పసుపు, ఇంగువ, బేకింగ్‌ సోడా, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి మిశ్రమంలా కలపాలి. ఒక స్పూన్‌ నూనె వేసి కలిపితే మిశ్రమం మెత్తగా అవుతుంది. తరువాత ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.


ఒక్కో ఉండను తీసుకుంటూ చేత్తో వెడల్పుగా ఒత్తుకోవాలి. కర్రతో వెడల్పుగా చేసుకుని కత్తితో ముక్కలుగా కూడా కట్‌ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక ఫఫ్డాలు వేసి వేగించుకోవాలి. ఫఫ్డాలను గోధుమ రంగులోకి మారే వరకు వేగించి, సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - 2020-10-24T15:56:21+05:30 IST