Hero Sai Dharam Tej ‌కు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ రూట్‌లోనే ఎందుకెళ్లాడు.. పోలీసులు ఏమంటున్నారు..!?

Published: Sat, 11 Sep 2021 08:59:01 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Hero Sai Dharam Tej ‌కు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ రూట్‌లోనే ఎందుకెళ్లాడు.. పోలీసులు ఏమంటున్నారు..!?

హైదరాబాద్ : మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతడి కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఇంకా అపస్మారక స్థితిలోనే అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. కాలర్‌ బోన్‌ విరిగిందని అపోలో ఆస్పత్రి వైద్యులు మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుండగా.. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు హెల్త్‌ బులెటిన్‌లో తెలిపారు.

Hero Sai Dharam Tej ‌కు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ రూట్‌లోనే ఎందుకెళ్లాడు.. పోలీసులు ఏమంటున్నారు..!?

అసలేం జరిగింది..!? 

అయితే.. ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అనే విషయాలను ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాదాపూర్ డీసీపీ ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడి వివరాలు వెల్లడించారు. ‘ప్రమాదం జరిగిన సమయంలో సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ప్రమాదం సమయంలో రహదారిపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి పడినట్టు తెలుస్తోంది. దాని వల్ల తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. ఆయన మద్యం సేవించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇసుక ఉంది. ప్రమాదం జరిగిన కూడా అతను సాయి ధరమ్ తేజ్ హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. సిటీ స్కాన్ చేసిన తర్వాత హెల్త్ కడిషన్ తెలుస్తుంది’ అని ఏబీఎన్‌తో మాదాపూర్ డీసీపీ వివరాలు తెలిపారు.

Hero Sai Dharam Tej ‌కు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ రూట్‌లోనే ఎందుకెళ్లాడు.. పోలీసులు ఏమంటున్నారు..!?

పోలీసు కేసు..!

కాగా.. ఈ ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసారు. నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసును పోలీసులు నమోదు చేసారు. ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద సాయి ధరమ్‌పై పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. రాత్రి 8:05 గంటలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు. సీసీ పుటేజీ ఆధారంగా రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో స్పోర్ట్స్ బైక్‌‌‌ను (ట్రంప్) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం గురించి పోలీసులకు 108 సిబ్బంది తెలియజేశారు.

Hero Sai Dharam Tej ‌కు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ రూట్‌లోనే ఎందుకెళ్లాడు.. పోలీసులు ఏమంటున్నారు..!?

ఈ రూట్‌లోనే ఎందుకెళ్లారు..!?

సాయి ధరమ్.. బంజారాహిల్స్ రోడ్ నంబర్-45 నుంచి గచ్చిబౌలి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కొత్తగా కట్టిన కేబుల్ బ్రిడ్జిపై నుంచి వెళ్తే తొందరగా వెళ్లొచ్చనే ఉద్దేశంతో చాలా మంది ఇదే దారిలో వెళ్తుంటారు. బ్రిడ్జిని దాదాపు దాటే సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వేగంగా వస్తున్న సమయంలో ఆ రహదారిపై ఇసుక ఉండటంతో బైక్ స్కిడ్ అయ్యింది. అయితే.. బైక్‌పై సాయిధరమ్ ఒక్కడే ఉన్నాడా..? లేకుంటే ఆయనతో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారనే విషయంపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఈ ఘటన గురించి తెలుసుకున్న మెగాభిమానులు తీవ్ర విషాదంలో ఉన్నారు. మొదట స్థానికంగా ఉన్న మెడికవర్ ఆస్పత్రిలో వైద్యం తీసుకోగా.. అక్కడ్నుంచి అపోలో ఆస్పత్రికి తరలించి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు. సాయి ధరమ్‌కు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఎప్పటికప్పుడు బులెటిన్‌ను రిలీజ్ చేస్తున్నారు.

Hero Sai Dharam Tej ‌కు ప్రమాదం ఎలా జరిగింది.. ఆ రూట్‌లోనే ఎందుకెళ్లాడు.. పోలీసులు ఏమంటున్నారు..!?


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

హైదరాబాద్Latest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.