క్రీడలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-10-18T04:13:24+05:30 IST

రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అన్నారు.

క్రీడలకు పూర్తిస్థాయి ప్రోత్సాహం
విజేతలకు ట్రోఫీని అందజేస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌

- మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌

- ముగిసిన నియోజకవర్గస్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

గద్వాల అర్బన్‌, అక్టోబరు 17 : రాష్ట్రంలో క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు, క్రీడాకారులను అన్ని విధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉం దని మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అన్నారు. బీఎస్‌ కే యూత్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ఇండోర్‌ స్టేడి యంలో వారంరోజుల పాటు నిర్వహించిన నియోజక వర్గ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, విజేతలకు ట్రోఫీ, మెమోంటోల ను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ  క్రీడా పోటీల్లో గెలుపుఓటములు సహజ మని, వాటిని సమాన స్ఫూర్తితో స్వీకరించాలన్నారు. గద్వాల ప్రాంత క్రీడాకారులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌ రెడ్డితో పాటు తాను కూడా తగిన తో డ్పాటునిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఓటమిని నామోషిగా భావించకుండా గెలుపుకోసం మరింత ప ట్టుదలతో ముందడుగు వేయాలన్నారు. టోర్నమెంటో ప్రథమ విజేతగా వినోద్‌ వ్యాపంర్స్‌ టీం,  ద్వితీయ స్థానంలో జేకే బిల్డర్స్‌ టీంలు నిలిచాయి. కార్యక్ర మంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు, ఎన్‌బీ మురళి, టి. శ్రీను, శ్రీమన్నారాయణ, నాగరాజు, కృష్ణ, బీఎస్‌కే యూత్‌ సభ్యులు ప్రవీణ్‌, భాస్కర్‌, నరేష్‌, మూర్తి, వీరు, టీఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు వినోద్‌, రిజ్వాన్‌, భగీరథ, వంశీ, రంజిత్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T04:13:24+05:30 IST